AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi Bank Holiday: ఇంతకీ బ్యాంకులకు వినాయక చవితి హాలీడే ఎప్పుడు.? పూర్తి వివరాలు..

ఇక వినాయక చవితి సందర్భంగా ప్రైవేట్‌తో పాటు, ప్రభుత్వ సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తారు. ఇక ప్రజల రోజువారీ జీవితాల్లో భాగమైన బ్యాంకుల సెలవులపై ప్రజల్లో ఆసక్తి ఉండడం సాధారణమైన విషయమే. అయితే ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడనే దానిపై మాత్రంల గందగరోళం నెలకొంది, కొన్ని చోట్ల సెప్టెంబర్ 18వ తేదీ అంటే మరికొన్ని చోట్ల 19వ తేదీ చవితి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వారీగా ఆర్‌బీఐ బ్యాంకులకు....

Ganesh Chaturthi Bank Holiday: ఇంతకీ బ్యాంకులకు వినాయక చవితి హాలీడే ఎప్పుడు.? పూర్తి వివరాలు..
Bank Holiday
Narender Vaitla
|

Updated on: Sep 18, 2023 | 11:58 AM

Share

భారత దేశంలో వినాయక చవితి పండుగకు ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా అంబరాన్నెంటేలా చవితి వేడుకలు జరుగుతాయి. ఇక వినాయక చవితి సందర్భంగా ప్రైవేట్‌తో పాటు, ప్రభుత్వ సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తారు. ఇక ప్రజల రోజువారీ జీవితాల్లో భాగమైన బ్యాంకుల సెలవులపై ప్రజల్లో ఆసక్తి ఉండడం సాధారణమైన విషయమే.

అయితే ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడనే దానిపై మాత్రంల గందగరోళం నెలకొంది, కొన్ని చోట్ల సెప్టెంబర్ 18వ తేదీ అంటే మరికొన్ని చోట్ల 19వ తేదీ చవితి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వారీగా ఆర్‌బీఐ బ్యాంకులకు సెలవులను ప్రకటించింది. ఇంతకీ ఏయే రాష్ట్రాల్లో ఏ తేదీల్లో చవితి సెలవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

* సెప్టెంబర్‌ 18, 2023: సోమవారం రోజున వినాయక చవతిని పురస్కరించుకొని కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

* సెప్టెంబర్‌ 19, 2023: గుజరాత్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడుతో పాటు గోవాలో బ్యాంకులకు మంగళవారం వినాయక చవితి సెలవులుగా ప్రకటించారు.

* సెప్టెంబర్‌ 20, 2023: ఇక ఒడిశాతో పాటు గోవాలో గణేష్‌ చతుర్థికి రెండు రోజులు సెలవుల ప్రకటించారు. ఈ రాష్ట్రాల్లో మంగళవారం, బుధవారం కూడా బ్యాంకులు మూసివేస్తారు.

సెప్టెంబర్‌లో నెలలో ఇతర సెలవులు..

* సెప్టెంబర్‌ 22, 2023: శ్రీ నారాయనణ గురు సమిధి రోజును పురస్కరించుకొని కొచ్చి, తిరువనంతపురంలో సెప్టెంబర్‌ 22వ తేదీన బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించార.

* సెప్టెంబ్‌ 23, 2023: నాల్గో శనివారం సందర్భంగా సెప్టెంబర్‌ 23వ తేదీన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* సెప్టెంబ్‌ 24, 2023: సెప్టెంబర్‌ 24వ తేదీన ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో సెప్టెంబర్‌ 23,24 తేదీల్లో వరుసగా రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు.

* సెప్టెంబర్‌ 25, 2023: సెప్టెంబర్‌ 25వ తేదీన శ్రీమాంత శంకర్‌దేవ్‌ జయంతి సందర్భంగా గువహటితో పాటు రాంచీలో బ్యాంకులకు సెలవు ఉండనుంది.

* సెప్టెంబర్‌ 27, 2023: మిలాద్‌ ఈ షెరీఫ్‌ పండగను పురస్కరించుకొని సెప్టెంబర్ 27 జమ్ము, కొచ్చి, శ్రీనగర్‌, తిరువనంతపురలో బ్యాంకులకు సెలవు ప్రకటించార.

* సెప్టెంబర్ 28, 2023: ఈద్ ఈ మిలాద్‌ కారణంగా అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, హైదరాబాద్‌, కాన్‌పూర్, లక్నో, ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ, రాయ్‌పూర్‌, రాచీలో బ్యాంకులు పని చేయవు.

* సెప్టెంబర్‌ 29, 2023: ఈద్‌ ఈ మిలాద్‌ ఉల్‌ నబీ పండుగను పురస్కరించుకొని సెప్టెంబర్‌ 29న గ్యాంగ్‌టక్‌, జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులు పనిచేయవు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..