Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.. ప్రజాస్వామ్యానికి సూచిక పాత పార్లమెంట్: ప్రధాని మోడీ..

PM Narendra Modi on Parliament : ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్ సూచిక.. కొత్త భవనంలోకి వెళ్లినా పాత భవనం ప్రేరణగా నిలుస్తుంది.. ఈ భవనంలో తీపి, చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.. ఈ భవనం భారత ప్రజల విశ్వాసానికి ప్రతీక.. వాదనలు ఎన్నో జరిగాయి. ఈ భవనంలో జరిగిన చర్చలు దేశ గతిని మార్చాయి. 75 ఏళ్లలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం..

PM Modi: భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.. ప్రజాస్వామ్యానికి సూచిక పాత పార్లమెంట్: ప్రధాని మోడీ..
PM Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 18, 2023 | 1:56 PM

PM Narendra Modi on Parliament : ‘‘ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్ సూచిక.. కొత్త భవనంలోకి వెళ్లినా పాత భవనం ప్రేరణగా నిలుస్తుంది.. ఈ భవనంలో తీపి, చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.. ఈ భవనం భారత ప్రజల విశ్వాసానికి ప్రతీక.. వాదనలు ఎన్నో జరిగాయి. ఈ భవనంలో జరిగిన చర్చలు దేశ గతిని మార్చాయి. 75 ఏళ్లలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం.. ఇంద్రజిత్ గుప్తా ఈ పార్లమెంట్ భవనంలో 43 ఏళ్ల పాటు సేవలందించారు. ఈ భవనం మన గౌరవాన్ని పెంచింది. పాత పార్లమెంట్ భవనాన్ని ప్రజల సందర్శన కోసం తెరిచే ఉంచుతాం.. 100 ఏళ్ల చార్రితక పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం.. ఇదే పార్లమెంట్‌లో నెహ్రూ అర్ధరాత్రి మాట్లాడారు. వారి స్ఫూర్తి ఇంకా కొనసాగుతుంది. పార్లమెంట్‌లోకి వెళితే గుడిలోకి వెళ్లిన అనుభూతి వస్తుంది’’.. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత పార్లమెంట్ భవనంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో ఈ రోజు చివరి రోజు కానుంది. రేపటినుంచి నూతన పార్లమెంట్ లో సమావేశాలు జరుగుతాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాత పార్లమెంట్, భారత్ సాధించిన విజయాలతోపాటు అనేక విషయాలను పంచుకున్నారు. స్వతంత్ర భారత 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు జరిగాయిన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజాస్వామ్యానికి పాత పార్లమెంట్‌ సూచికగా అభివర్ణించారు.. కొత్త భవనంలోకి వెళ్లినా.. పాతభవనం ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు ప్రధాని. ప్రధాని మోదీ తన ప్రసంగంలో తొలి ప్రధాని నెహ్రూ నుంచి మన్మోహన్‌ పాలనా కాలం వరకూ సాధించిన విజయాలను ప్రస్థావించారు. ఈ పార్లమెంట్‌లోనే ఆర్టికల్‌ 370 రద్దు చేశాం. వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌ తీసుకొచ్చింది ఇక్కడే. జీఎస్టీకి తీర్మానం చేశామని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రాంగణంగా ఉండేదని గుర్తుచేశారు.

అనేక రంగాల్లో భారత్‌ గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు ప్రధాని. అందరి సమిష్టి కృషి వల్లే జీ20 విజయవంతమైందని తెలిపారు. జీ20 విజయాన్ని ప్రపంచం మొత్తం కీర్తిస్తోందని.. ఈ విజయం ఫెడరల్‌ స్ఫూర్తికి నిదర్శనం అని తెలిపారు మోదీ.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని లోక్‌సభలో ప్రధాని మోదీ మరోసారి ప్రస్థావించారు.. ఈ పార్లమెంట్‌లోనే తెలంగాణ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో విభజన సరిగా జరగలేదని వ్యాఖ్యానించారు మోదీ. తెలంగాణ హక్కులు కాలరాసే ప్రయత్నం జరిగిందన్నారు..

గణేష్‌ చతుర్థి పర్వదినం రోజు కొత్త పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నామన్నారు ప్రధాని మోదీ.. వినాయకుడి ఆశీస్సులు కూడా మనపై ఉన్నాయని.. నిర్విఘ్నంగా భారత్‌ వికాస్‌ యాత్రను కొనసాగిద్దామని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..