CM Yogi Adityanath: దివ్యాంగుల పాఠశాలను సందర్శించి చిన్నారులతో మచ్చటించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్.. గోరఖ్‌పూర్‌లో పర్యటిస్తున్న సందర్భంలో.. హుమాయాన్‌పూర్‌లోని ప్రభుత్వ ప్రత్యేక అవసరాల పాఠశాలను సందర్శించారు. అక్కడ చదువుతున్న మూగ, చెవిటి, వికలాంగ విద్యార్థులను కలిశారు. ముఖ్యమంత్రిని చూసిన చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆ చిన్నారుల ఉత్సాహాన్ని చూసి.. సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గుర్యయారు. ఆ తర్వాత వారితో సంభాషించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను చిన్నారులతో కలిసి సీఎం యోగీ తిలకించారు. చిన్నారులు తమ నైపుణ్యాలతో తయారుచేసిన అద్భుతమైన కళాకండాలను చూసి వారిని ప్రశంసించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్.. గోరఖ్‌పూర్‌లో పర్యటిస్తున్న సందర్భంలో.. హుమాయాన్‌పూర్‌లోని ప్రభుత్వ దివ్యాంగుల పాఠశాలను సందర్శించారు. అక్కడ చదువుతున్న మూగ, చెవిటి, వికలాంగ విద్యార్థులను కలిశారు. ముఖ్యమంత్రిని చూసిన చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆ చిన్నారుల ఉత్సాహాన్ని చూసి.. సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగానికి గుర్యయారు. ఆ తర్వాత వారితో సంభాషించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను చిన్నారులతో కలిసి సీఎం యోగీ తిలకించారు. చిన్నారులు తమ నైపుణ్యాలతో తయారుచేసిన అద్భుతమైన కళాకండాలను చూసి వారిని ప్రశంసించారు. అలాగే ఆ పాఠశాల ఆవరణ, తరగతి గదులను, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. మూగ, చెవిటి పిల్లలకు విద్యనందించేందుకు వినియోగించే పరికరాలు, వాటి నాణ్యతపై సమాచారాన్ని సేకరించారు.
ఈ సందర్భంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఈ పాఠశాలలో హాస్టల్ నిర్మించి రెసిడెన్షియల్ పాఠశాలగా మారుస్తామని చెప్పారు. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని వికలాంగ పిల్లలకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. అలగే చిన్నారుల్లో ప్రతిభ మెరుగుపడుతుందని తెలిపారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాటలను అందులో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు పిల్లలకు తన సంకేతాల ద్వారా తెలియజేశాడు. రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని సీఎం అన్నారు. అలాగే ఆ పాఠశాల రవాణాకు సంబంధించిన కొన్ని సమస్యలపై అలాగే ఆ పాఠశాలకు చేరుకోవడానికి మార్గం ఉండేలా చూడాలని అన్నారు. చాలా కాలం తర్వాత ఈ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Cm Yogi
ఇంతకు ముందు ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని.. ప్రభుత్వం ఇక్కడ కొత్త భవనాన్ని నిర్మించిందని తెలిపారు. అలాగే వికలాంగులకు బదులుగా దివ్యాంగులు అని నామాకరణం చేసి.. వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కృషి చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ సుభాష్ దూబే మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ పాఠశాలలో 100 మంది పిల్లలు చదువుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కోరిక మేరకు త్వరలోనే రెసిడెన్షియల్ పాఠశాలగా మారుస్తామని హమీ ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..