AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నెహ్రూ, ఇందిరా, నరసింహారావులపై ప్రశంసలతోపాటు.. పార్లమెంట్ చరిత్రలో చేదు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసిన ప్రధాని మోదీ

Parliament Special Session: జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పండిట్ నెహ్రూ ప్రారంభ మంత్రుల మండలి అని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నెహ్రూ మంత్రివర్గంలో చేర్చబడిన బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను భారతదేశానికి తీసుకురావాలని ఉద్ఘాటించారు. ఫ్యాక్టరీ చట్టాలలో అంతర్జాతీయ సూచనలను అమలు చేయాలని వాదించారు. నేటికీ దేశం దాని ఫలితాలను పొందుతోంది. నెహ్రూ జీ ప్రభుత్వంలో..

PM Modi: నెహ్రూ, ఇందిరా, నరసింహారావులపై ప్రశంసలతోపాటు.. పార్లమెంట్ చరిత్రలో చేదు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసిన ప్రధాని మోదీ
PM Modi
Sanjay Kasula
|

Updated on: Sep 18, 2023 | 4:25 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నూతన పార్లమెంట్‌ భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ తన ప్రభుత్వ విజయాలను తెలియజేయడమే కాకుండా.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరా, పీవీ నరసింహారావు పాలనతోపాటు ఓటుకు నోటు, ఎమర్జెన్సీ, 370… పార్లమెంట్ చరిత్రలో చేదు, తీపి జ్ఞాపకాలను ప్రధాని మోదీ ప్రస్థావించారు.

జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ.. ఇది పండిట్ నెహ్రూ ప్రారంభ మంత్రుల మండలి అని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నెహ్రూ మంత్రివర్గంలో చేర్చబడిన బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలను భారతదేశానికి తీసుకురావాలని ఉద్ఘాటించారు. ఫ్యాక్టరీ చట్టాలలో అంతర్జాతీయ సూచనలను అమలు చేయాలని వాదించారు. నేటికీ దేశం దాని ఫలితాలను పొందుతోంది. నెహ్రూ జీ ప్రభుత్వంలో బాబా సాహెబ్ అబాండేకర్ వాటర్ పాలసీని తీసుకొచ్చారు.

భారతదేశ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అవసరమని అబాండేకర్ ఎప్పుడూ చెబుతుండేవారు. దేశ తొలి వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ విధానాన్ని రూపొందించారు. నేటికీ, ఏ విధానాలు రూపొందించినా, వారి ఆత్మ మొదటి ప్రభుత్వ విధానాలతో ముడిపడి ఉందని గుర్తు చేశారు.

లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ఇందిరా గాంధీ వరకు..

ప్రధాని మోదీ తన ప్రసంగంలో మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ప్రస్తావించారు. 1965 పాకిస్తాన్ యుద్ధంలో శాస్త్రి జీ ఈ ఇంటి నుంచే సైనికులను ప్రోత్సహించారని ఆయన అన్నారు. ఇక్కడి నుంచే హరిత విప్లవానికి బలమైన పునాది పడింది. ఇందిరా గాంధీ నాయకత్వంలో.. ఈ సభ బంగ్లాదేశ్ విముక్తి కోసం ఉద్యమానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేవారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని ఈ సభలోనే చూశారు. ఈ సభ ప్రజాస్వామ్యం  బలమైన పునరాగమనాన్ని కూడా చూసింది.

నరసింహారావు నాటి విధానాలను ప్రస్తావించారు

భారతదేశం పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కాలాన్ని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆర్థిక విధానాలతో దేశం ఒకప్పుడు భారంగా మారిందని అన్నారు. మాజీ ప్రధాని నరసింహారావు ప్రభుత్వం పాత విధానాలను వదిలి కొత్త విధానాలను రూపొందించిందని.. వాటి ప్రయోజనాలు నేటికీ అందుతున్నాయన్నారు.

ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని వివరించారు

దశాబ్దాలుగా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రధాని అన్నారు. ఈ సభలో మా ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించింది. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ మంత్రం, అనేక చారిత్రక నిర్ణయాలు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా ఈ సభలో తీసుకున్నారు. ఆర్టికల్ 370ని ఈ సభ ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఆర్టికల్ 370 వంటి పెండింగ్ సమస్యలను కూడా ఈ సభలో పరిష్కరించారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, జీఎస్టీపై కూడా ఈ సభలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇక్కడే జరిగింది. పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇక్కడ ఆమోదించబడ్డాయి.

ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ..

యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ విభజన సరిగ్గా జరగలేదన్నారు ప్రధానమంత్రి మోదీ.. పాత పార్లమెంటు వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన మోదీ పలు విషయాలను ప్రస్తావించారు. ఇదే భవనంలో తెలంగాణ ఏర్పాటు జరిగిందని అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో నెత్తుటేరులు పారాయని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో తెలంగాణ హక్కులు కాలరాసే ప్రయత్నం జరిగిందన్నారు ప్రధాని మోదీ..

విభజన సరిగా జరగలేదని ప్రధాని మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. అవకాశం దొరికిన ప్రతిసారీ ఈ విషయంలో కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా పాత పార్లమెంట్‌లో ఆఖరు ప్రసంగం సందర్భంలోనూ విభజన వివాదాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ తీరు ఎలాంటి నష్టాల్ని మిగిల్చిందో చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం