Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19: కొవిడ్ మూలాలు తెలుసుకునేందుకు దర్యాప్తును వదలిపెట్టేది లేదు.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతాలాకుతలం చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ మూలాలపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధానోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మూలాలపై నిజనిర్దారణకు పూర్తిగా సహకరించాలని చైనాను మరోసారి కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో చైనా తమకు కచ్చితంగా సహకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. చైనాలోని వుహన్ ల్యాబ్ నుంచి కరోనా మహమ్మరి బయటపడినట్లు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి.

COVID-19: కొవిడ్ మూలాలు తెలుసుకునేందుకు దర్యాప్తును వదలిపెట్టేది లేదు.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Who Chief Tedros Adhanom Ghebreyesus
Follow us
Aravind B

|

Updated on: Sep 18, 2023 | 3:44 PM

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని అతాలాకుతలం చేసిన సంగతి అందిరికీ తెలిసిందే. అయితే ఈ వైరస్ మూలాలపై ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధానోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మూలాలపై నిజనిర్దారణకు పూర్తిగా సహకరించాలని చైనాను మరోసారి కోరినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో చైనా తమకు కచ్చితంగా సహకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. చైనాలోని వుహన్ ల్యాబ్ నుంచి కరోనా మహమ్మరి బయటపడినట్లు ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను తెలుసుకునేందుకు నిజ నిర్దారణ కోసం.. చైనాకు వైద్య నిపుణులను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే వివిధ దేశాలు చైనాతో జరిపే ద్వైపాక్షిక సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాలని అన్నారు.

కరోనా మూలాలు తెలుసుకునేందుకు వుహాన్ ల్యాబ్‌లో ప‌రిశోధ‌న‌ల‌కు అనుమ‌తి ఇస్తే, డ‌బ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందాన్ని పంపిస్తామని.. చైనాకు ఇప్పటికే లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ మాన‌వాళిని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసినటువంటి కొవిడ్-19 అసలు ఎక్కడ నుంచి వ‌చ్చింద‌నే విష‌య‌మై ఇంకా సరైన స‌మాచారం లేదు. ఇదిలా ఉండగా.. 2019లో డెసెంబర్‌లో వుహాన్‌లోని తొలి కేసు న‌మోదైన సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు కొవిడ్‌-19 వైర‌స్ అంశంలో రెండు వేరువేరు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. వుహాన్ ల్యాబ్‌లో ప‌రిశోధ‌న‌లు జరుగుతుండగా.. కొవిడ్‌-19 వైర‌స్ బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. మరోవైపు.. కొవిడ్ సోకిన జంతువు నుంచి మాన‌ుషుల్లోకి వ్యాపించి ఉండే అవకాశం ఉందని మ‌రికొంద‌రు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే దీనిపై 2021లో డ‌బ్ల్యూహెచ్ఓ ఓ నిజ నిర్ధార‌ణ క‌మిటీని నియమించింది. ఇది చైనా వైద్య బృందంతో క‌లిసి ఉమ్మడి నివేదికను తెలియజేసింది. వుహాన్ మార్కెట్‌లోని ఒక గ‌బ్బిలం నుంచి ఈ కరోనా వైర‌స్ సోకి ఉండొచ్చున‌ని నివేదిక‌లో పేర్కొంది. అంతేగాని మిగ‌తా విషయాలను బయటపెట్టలేదు.

ఇదిలా ఉండగా.. మరోవైపు డ‌బ్ల్యూహెచ్ఓ- చైనా వైద్య నిపుణుల ఉమ్మడి నివేదిక‌పై పలు అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీనివల్ల త‌మ‌ నిజ నిర్ధార‌ణ బృందాన్ని మాత్రమే వుహాన్ ల్యాబ్‌లోకి వెళ్లేలా పర్మిషన్ ఇవ్వాలని.. ప‌లుసార్లు డ‌బ్ల్యూహెచ్ఓ కోరినప్పటికీ కూడా చైనా అంగీక‌రించ‌డం లేదు. అయినా కూడా ఈ అంశంపై ద‌ర్యాప్తును విర‌మించే ప్రస‌క్తి లేద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డీజీ టెడ్రోస్ అధానోమ్‌ ఘెబ్రోయెస‌స్ అన్నారు. అలాగే కొవిడ్ వైర‌స్‌కు మూలాలు ఎక్కడ ఉన్నాయ‌న్న విష‌య‌మై కచ్చిత‌మైన స‌మాచారం తెలుసుకుంటామని చాలాసార్లు బ‌హిరంగానే ప్రకటన చేశారు.

ఇవి కూడా చదవండి