- Telugu News Photo Gallery Business photos Government Announces Welfare Measures For LIC Employees and Agents
LIC Employees: ఎల్‌ఐసీ ఏజెంట్లకు గుడ్‌న్యూస్.. గ్రాట్యుటీ పరిమితి పెంపు, కుటుంబ పెన్షన్
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 13 లక్షలకు పైగా ఏజెంట్లు ఉన్నారు. వారి ఉత్సాహం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎల్‌ఐసీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంతో బెనిఫిట్ కలుగనుంది. ఎల్‌ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి ..
Subhash Goud | Edited By: Ravi Kiran
Updated on: Sep 19, 2023 | 12:18 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) ఏజెంట్లు, ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లకు ప్రభుత్వం పలు ఆఫర్లను ప్రకటించింది. గ్రాట్యుటీ పరిమితి, తిరిగి నియమించబడిన ఏజెంట్ల పునరుద్ధరణ కమీషన్, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ, కుటుంబ పెన్షన్ పెంపు తదితర చర్యలు చేపట్టింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 13 లక్షలకు పైగా ఏజెంట్లు ఉన్నారు. వారి ఉత్సాహం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎల్‌ఐసీలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎంతో బెనిఫిట్ కలుగనుంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఎల్‌ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే దీని కారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో పని చేస్తున్న13 లక్షల మంది ఏజెంట్లకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. తిరిగి నియమించబడిన ఏజెంట్లకు వారి పాత పాలసీ వ్యాపారంపై పునరుద్ధరణ కమీషన్ చెల్లించబడుతుంది. ఇది మునుపటి ఏజెన్సీలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నప్పుడు కస్టమర్ చేసిన పాలసీల పునరుద్ధరణకు సంబంధించినది.

ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉంటుంది. 25,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం 30 శాతం చొప్పున కుటుంబ పింఛను అందించేందుకు నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్‌ఐసీ ఇప్పటికీ భారతదేశంలో అతిపెద్ద జీవిత బీమా కంపెనీగా రికార్డును కలిగి ఉంది. అనేక ప్రైవేట్ బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ఎల్ఐసీ తన ఆధిపత్యం చెలాయించింది. దాని ఆదాయ వృద్ధి రేటు కూడా పెరుగుతోంది. అందుకే దేశంలో చాలా మంది హెల్త్ పాలసీ తీసుకోవాలంటే ఎల్‌ఐసీనే ఆశ్రయిస్తున్నారు.





























