SBI Wecare: సీనియర్ సిటిజన్లకు అలెర్ట్.. అధిక వడ్డీ వచ్చే ఆ ఎస్‌బీఐ పథకంలో చేరడానికి పది రోజులే గడువు
బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు ఆకర్షించడానికి వివిధ పథకాలను అధిక వడ్డీ రేట్లతో ప్రకటిస్తూ ఉంటాయి. ఎస్‌బీఐ కూడా ఎస్‌బీఐ వి కేర్ పేరుతో ఓ పథకాన్ని అందుబాటులో ఉంచింది. సాధారణంగా ఈ పథకంలో చేరడానికి గడువు అయిపోయినా ప్రజాదరణ మేరకు మరో మూడు నెలలు గడువు పెంచింది. ఈ పెంచిన గడువు కూడా ఈ నెలాఖరుకు అయ్యిపోతుంది. అంటే మరో 10 రోజుల్లో ఈ పథకంలో చేరడానికి గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ వి కేర్ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి మనం ఎప్పటినుంచే వింటూ ఉంటాం. మన దగ్గర డబ్బు ఉంటేనే బంధాలు, బంధుత్వాలు ఉంటాయని నమ్మేవారు చాలా మంది ఉంటారు. అందువల్ల ఇప్పటి నుంచే భవిష్యత్ కోసం పొదుపు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో వేతన జీవులు ఎక్కువ. అందువల్ల వారి భవిష్యత్ కోసం వారు పని చేసే సంస్థలు ప్రభుత్వం నిర్వహించే ఈపీఎఫ్ వంటి పథకాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే రిటైరైన సమయంలో ఆర్థిక భరోసాను అందిస్తాయి. దీంతో రిటైరైన వెంటనే అధిక మొత్తంలో సొమ్ము వారి చేతిలో ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైరైన అధిక మొత్తంలో సొమ్ము ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్లు నమ్మకమైన రాబడి కోసం ఆ సొమ్మును ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లకు ఆకర్షించడానికి వివిధ పథకాలను అధిక వడ్డీ రేట్లతో ప్రకటిస్తూ ఉంటాయి. ఎస్‌బీఐ కూడా ఎస్‌బీఐ వి కేర్ పేరుతో ఓ పథకాన్ని అందుబాటులో ఉంచింది. సాధారణంగా ఈ పథకంలో చేరడానికి గడువు అయిపోయినా ప్రజాదరణ మేరకు మరో మూడు నెలలు గడువు పెంచింది. ఈ పెంచిన గడువు కూడా ఈ నెలాఖరుకు అయ్యిపోతుంది. అంటే మరో 10 రోజుల్లో ఈ పథకంలో చేరడానికి గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ వి కేర్ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎస్‌బీఐ వి కేర్ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ పథకం. ఈ పథకాన్ని మే 2020లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరడానికి దఫదఫాలుగా గడువులు పెంచారు. అయితే ఆఖరకు సెప్టెంబర్ 30తో ఈ పథకంలో చేరడానికి గడువు ముగుస్తుంది. ముఖ్యంగా ఎస్‌బీఐ అందించే ఈ ప్రత్యేక ఎఫ్‌డీ పథకం ప్రధాన లక్ష్యం సీనియర్ సిటిజన్ల టర్మ్ డిపాజిట్లపై అదనపు వడ్డీని అందించడంతో పాటు వారి ఆదాయానికి రక్షణ కల్పించడంగా ఉంది. ఈ పథకంలో ఇచ్చే వడ్డీ రేట్లు ఇతర ఎస్‌బీఐ పథకాలతో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటాయి.
ఎస్‌బీఐ వి కేర్ డిపాజిట్ వ్యవధి
సీనియర్ సిటిజన్ పబ్లిక్ కోసం కార్డు రేటు కంటే 30 బీపీఎస్ (ప్రస్తుత ప్రీమియం 50 బీపీఎస్ కంటే ఎక్కువ) అదనపు ప్రీమియం పొందుతారు. టర్మ్ డిపాజిట్ కోసం వడ్డీ చెల్లింపు నెలవారీ/త్రైమాసిక వ్యవధిలో చేస్తారు. ప్రత్యేక టర్మ్ డిపాజిట్ మెచ్యూరిటీ వడ్డీపై టీడీఎస్‌ను మినహాయించి కస్టమర్ ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది. రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే తక్కువ) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఎస్‌బీఐ వి కేర్ వడ్డీ రేట్లు
ఎస్‌బీఐ వి కేర్ పథకం 5 నుంచి 10 సంవత్సారల కాల వ్యవధిలో 7.71 శాతం వడ్డీని అందిస్తాయి. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సారల్లో 7.19 శాతం, రెండు నుంచి మూడు సంవత్సరాల్లో 7.71 శాతం, సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్య 7.50 శాతం వడ్డీని అందిస్తాయి. 211 రోజుల నుంచి సంవత్సరం కాల వ్యవధికి 6.40 శాతంతో 181 రోజుల నుంచి 210 రోజుల వ్యవధికి 5.88 శాతం వడ్డీని పొందవచ్చు.
సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకం డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్‌గా వేస్తే మంచి రాబడిని పొందవచ్చు ఈ డిపాజిట్ కనిష్ట వ్యవధి 5 సంవత్సరాలుగా ఉంటుంది. అలాగే గరిష్ట డిపాజిట్ వ్యవధి 10 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ ఎఫ్‌డీ పథకంలో లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వర్తించే రేటుతో టీడీఎస్ మినహాయించి వడ్డీను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..