UPI Pay Later: ఆ బ్యాంకుల ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఖాతాలో సొమ్ము లేకపోయినా యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్
మీ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పుడే యూపీఐ చెల్లింపు సాధ్యమయ్యేది. అయితే వినియోగదారులు ఇప్పుడు తగినంత బ్యాలెన్స్ లేకుండా కూడా యూపీ చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ లావాదేవీల కోసం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌లను చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతించింది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు వినియోగదారులు తమ ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్‌తో చెల్లింపులు చేయడంలో సహాయపడేందుకు 'పే లేటర్' ఆప్షన్‌ను అందించడం ప్రారంభించాయి.
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ రాకతో ఇటీవలి సంవత్సరాల్లో ఆన్‌లైన్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ని ఉపయోగించడం ద్వారా క్షణాల్లో సులభంగా చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలను యూపీఐ యాప్‌లకు లింక్ చేస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ లేదా నెంబర్ ద్వారా సింపుల్ లావాదేవీలు జరుపుతున్నారు. లావాదేవీల సౌలభ్యం కారణంగా చాలా మంది వినియోగదారులు ఎక్కువగా యూపీఐ చెల్లింపులను ఇష్టపడుతున్నారు. ఇప్పటివరకు మీ బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పుడే యూపీఐ చెల్లింపు సాధ్యమయ్యేది. అయితే వినియోగదారులు ఇప్పుడు తగినంత బ్యాలెన్స్ లేకుండా కూడా యూపీ చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ లావాదేవీల కోసం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌లను చేర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అనుమతించింది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు వినియోగదారులు తమ ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్‌తో చెల్లింపులు చేయడంలో సహాయపడేందుకు ‘పే లేటర్’ ఆప్షన్‌ను అందించడం ప్రారంభించాయి. అతుకులు లేని చెల్లింపులను సులభతరం చేయడానికి క్రెడిట్ లైన్‌లు వినియోగదారుల యూపీఐ ఖాతాలకు లింక్ చేసుకోవచ్చు.
యూపీఐ పే లేటర్
ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల కోసం వినియోగదారులు తమ సేవింగ్స్ ఖాతాలు, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్‌లను మాత్రమే ఉపయోగించడానికి వీలుండేది. అయితే ప్రస్తుతం యూపీఐ లావాదేవీల కోసం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌లను అనుమతించాలనే ఆర్‌బీఐ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్‌తో లేకపోయినా కూడా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పేతో సహా దాదాపు ప్రతి యూపీఐ అప్లికేషన్ ద్వారా పని చేస్తుంది. ముందుగా నిర్వచించిన పరిమితితో క్రెడిట్ లైన్ కోసం బ్యాంకులకు సమ్మతి ఇచ్చిన తర్వాత వినియోగదారులు వారి యూపీఐ యాప్ ద్వారా మంజూరైన మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. అలాగే ముందుగా నిర్ణయించిన గడువులోగా వారి బకాయిలను చెల్లించవచ్చు. అయితే ముందుగా మంజూరైన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం కోసం రుసుము విధించే అవకాశం ఉందని మాత్రం వినియోగదారులు గుర్తించాలి.
ప్రస్తుతం రెండు బ్యాంకులే..
ప్రస్తుతం హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ నౌ పే లేటర్, ఐసీఐసీఐ పేలేటర్‌తో తమ క్రెడిట్ లైన్‌లను ప్రారంభించాయి. ఖాతాదారుల అర్హత ఆధారంగా రెండు బ్యాంకులు గరిష్టంగా రూ.50,000 క్రెడిట్ లైన్‌ను ఉంచాయి. ఈ సేవలను ఉపయోగించడానికి ఒకరు తమ బకాయిలను చెల్లించడానికి లేదా చెల్లింపులు చేయడానికి క్రెడిట్‌ని ఉపయోగించవచ్చు. తర్వాత నెలాఖరులో ఛార్జీలు లేదా వడ్డీ రేట్లతో పాటు మొత్తం మొత్తాన్ని సెటిల్ చేయవచ్చు.
యూపీఐ పే లేటర్‌తో చెల్లింపులు ఇలా
- ఖాతాదారుల యూపీఐ యాప్‌లలో పే లేటర్ ఎంపికను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ సేవలను ప్రారంభించవచ్చు.
- ఖాతాను సృష్టించిన తర్వాత యూపీఐ ద్వారా లావాదేవీలు చేయడానికి నిర్దిష్ట క్రెడిట్ లైన్ కేటాయిస్తారు.
- పేలేటర్ కింద ఉన్న ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతా వ్యాపారులకు చెల్లింపులు చేయడానికి మాత్రమే అనుమతి ఇస్తుంది. ఏదైనా ఇతర బ్యాంక్ ఖాతాకు నిధుల బదిలీ మాత్రం కుదరదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయాల్సిందే