EPF Balance: మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌పై వడ్డీ ఎంత వస్తుందో తెలుసా? వడ్డీని లెక్కించేది ఎలాగంటే..?

ఒక ఉద్యోగి తన బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతాన్ని నెలవారీ ప్రాతిపదికన ఈపీఎఫ్‌ పొదుపునకు జమ చేస్తారు. అదనంగా యజమాని కూడా సమాన మొత్తాన్ని అందజేస్తారు. ఈపీఎఫ్‌ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్వహిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఏకమొత్తంలో సేకరించిన నిధిని పొందుతాడు. పదవీ విరమణ ప్రణాళిక కోసం మీ రిటైర్మెంట్ కార్పస్ గురించి కచ్చితమైన అంచనాను పొందడానికి మీ ఈపీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కించాలి.

EPF Balance: మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌పై వడ్డీ ఎంత వస్తుందో తెలుసా? వడ్డీని లెక్కించేది ఎలాగంటే..?
Epfo
Follow us
Srinu

|

Updated on: Sep 19, 2023 | 3:45 PM

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) అనేది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం. ఇది ప్రైవేట్ రంగంలోని జీతాలు పొందే ఉద్యోగులు, కార్మికులందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక ఉద్యోగి తన బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతాన్ని నెలవారీ ప్రాతిపదికన ఈపీఎఫ్‌ పొదుపునకు జమ చేస్తారు. అదనంగా యజమాని కూడా సమాన మొత్తాన్ని అందజేస్తారు. ఈపీఎఫ్‌ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) నిర్వహిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఏకమొత్తంలో సేకరించిన నిధిని పొందుతాడు. పదవీ విరమణ ప్రణాళిక కోసం మీ రిటైర్మెంట్ కార్పస్ గురించి కచ్చితమైన అంచనాను పొందడానికి మీ ఈపీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కించాలి. కాబట్టి ఈపీఎఫ్‌ ప్రస్తుతం ఎంత వడ్డీ ఇస్తుంది? ఆ వడ్డీ శాతాన్ని ఎలా లెక్కలు వేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఈపీఎఫ్‌ ఖాతాకు వడ్డీ రేటు ఎంత?

ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో సమావేశం తర్వాత ప్రతి సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్‌వడ్డీ రేటును సెట్ చేస్తుంది. ఈపీఎఫ్‌కి ప్రస్తుత సంవత్సరం వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. ఇది గతేడాది రేటు 8.10 శాతం కంటే కొంచెం ఎక్కువ.  

వడ్డీ లెక్కింపు ఇలా

మీ ఈపీఎఫ్‌ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కించడానికి మీరు నెలవారీ ముగింపు బ్యాలెన్స్, ప్రస్తుత ఈపీఎఫ్‌ వడ్డీ రేటును తెలుసుకోవాలి. మీరు ప్రతి నెలా వడ్డీని విడిగా లెక్కించాలి. మీరు కొత్త ఈపీఎఫ్‌ఖాతాను తెరిచినప్పుడు ప్రారంభ బ్యాలెన్స్ సున్నా కాబట్టి మొదటి నెల వడ్డీ సున్నాగా ఉంటుంది. రెండో నెలలో మీరు క్రింది ఫార్ములా ఉపయోగించి ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌పై వడ్డీని లెక్కించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈపీఎఫ్‌పై పై నెలవారీ వడ్డీ 

(నెల ప్రారంభ బ్యాలెన్స్ x ప్రస్తుత వడ్డీ రేటు)/12

ఉదాహరణకు, మొదటి నెల సహకారం రూ. 10,000 అనుకుందాం. దీనిపై ఎలాంటి వడ్డీ వసూలు చేయరు. ఆ తర్వాత రెండవ నెలలో తాజా సహకారం అందించబడినందున ప్రారంభ బ్యాలెన్స్ రెట్టింపు అవుతుంది. కాబట్టి గణన కోసం మొత్తం రూ. 20,000 పరిగణించాలి. వచ్చే వడ్డీ రూ. 135.83 (20000 x 8.15 శాతం)/12. ఇది రూ. 136కి పూర్తి అవుతుంది.. ప్రతి నెలా ఇదే గణన చేయాలి. అలాగే సంవత్సరం చివరిలో అన్ని బ్యాలెన్స్‌లను జోడించడం ద్వారా మీకు వార్షిక వడ్డీ లభిస్తుంది.

ఈపీఎఫ్‌ సైట్‌లో వడ్డీ కాలిక్యులేటర్‌

మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌పై వడ్డీని మాన్యువల్‌గా లెక్కించడం చాలా శ్రమతో కూడుకున్న విషయం. కాబట్టి ఆన్‌లైన్ ఈపీఎఫ్‌ వడ్డీ కాలిక్యులేటర్‌ని ఉపయోగించి ప్రయత్నించడం మంచిది. మీ ప్రాథమిక జీతంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్, వయస్సు, ఈపీఎఫ్‌విరాళాలు ప్రారంభ తేదీ వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంచుమించు వడ్డీ మొత్తం సెకన్లలో మీ స్క్రీన్‌పై ప్రతిబింబిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..