SBI We Care: ఎస్బీఐ వుయ్ కేర్ పథకం చివరి తేదీ పొడిగించారు.. ఈ పథకం వివరాలు.. ఇప్పటివరకూ పొడిగించారో తెలుసుకోండి!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన 'వుయ్ కేర్' ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ఈ పథకం సెప్టెంబర్ 30 తో ముగియాల్సి ఉంది.
SBI We Care: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ‘వుయ్ కేర్’ ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఇంతకు ముందు ఈ పథకం సెప్టెంబర్ 30 తో ముగియాల్సి ఉంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంపై ఎక్కువ లబ్ధిని పొందుతారు. ఈ పథకంలో, సాధారణ పౌరులు సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) నుండి అందుకున్న వడ్డీ కంటే 0.80% ఎక్కువ వడ్డీని పొందుతారు. నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదు చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం, SBI ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 5.40% వడ్డీని అందిస్తోంది.
SBI యొక్క We Care పథకానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు
- ఎస్‌బిఐ ఇటీవల సీనియర్ సిటిజన్‌ల కోసం ‘వుయ్ కేర్’ పేరుతో కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది.
- సీనియర్ సిటిజన్లు ఈ పథకంపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ పథకం రిటైల్ టర్మ్ డిపాజిట్ సెగ్మెంట్ కింద ప్రారంభించబడింది.
- ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ అందిస్తుంది.
- SBI యొక్క ఈ కొత్త పథకంలో, 5 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్‌లపై (FD లు) 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ లభిస్తుంది.
- సీనియర్ సిటిజన్లు సాధారణ ప్రజల కంటే 5 సంవత్సరాల కంటే తక్కువ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 0.50% ఎక్కువ వడ్డీని పొందుతారు.
- 5 సంవత్సరాల కంటే ఎక్కువ రిటైల్ టర్మ్ డిపాజిట్‌లకు అదనంగా 0.30% తో సహా 0.80% వడ్డీ లభిస్తుంది.
- అంటే, మీరు ఈ పథకం కింద 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మీకు 6.20% వడ్డీ లభిస్తుంది.
- అకాల ఉపసంహరణపై అదనపు వడ్డీ చెల్లించరు. నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదు చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.
ఏ బ్యాంకు 5 సంవత్సరాల కాలపరిమితిపై ఎంత వడ్డీని ఇస్తోందంటే..
బ్యాంక్ | 5 సంవత్సరాల FD పై వడ్డీ రేటు (%) | 5 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన FD లపై వడ్డీ రేటు (%) |
ICICI | 5.85 | 6.30 |
HDFC | 5.80 | 6.25 |
బ్యాంక్ ఆఫ్ బరోడా | 5.75 | 5.75 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 5.75 | 5.75 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 5.55 | 5.55 |