Gold Income Tax: ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తే ఎంత పన్ను వర్తిస్తుంది..? పూర్తి వివరాలు..!

Gold Income Tax: పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటనే చెప్పాలి. స్థిరమైన పెట్టుబడి సాధనంగా భావించి బంగారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యత..

Gold Income Tax: ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తే ఎంత పన్ను వర్తిస్తుంది..? పూర్తి వివరాలు..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 30, 2021 | 8:30 AM

Gold Income Tax: పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటనే చెప్పాలి. స్థిరమైన పెట్టుబడి సాధనంగా భావించి బంగారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంలో పెట్టుబ‌డులకు కేవలం భౌతిక రూపంలోనే పసిడి కొనుగోలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. డిజిట‌ల్ రూపంలోనూ, కాగిత రూపంలోనూ కొనుగోలు చేయవచ్చు. ఆభ‌ర‌ణాలు, కాయిన్లు, బార్లు రూపంలో భౌతిక బంగారం ల‌భిస్తుంది. పేటీఎం, గూగుల్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్లలో డిజిట‌ల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇవి కాకుండా గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా కాగిత రూపంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే, బంగారం ఏ రూపంలో కొనుగోలు చేసినా పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే, ఏ రూపంలో కొనుగోలు చేస్తున్నాం? ఎంత కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తున్నాం? అనే అంశంపై ప‌న్ను ఆధార‌ప‌డి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఏ రూపంలో బంగారం కొనుగోలు చేస్తే ఎంత పన్ను వర్తింస్తుందో తెలుసుకుందాం.

భౌతిక బంగారం:

ఆభ‌ర‌ణాలు, నాణేలు, బార్లు రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తే వాటిని ఎంత కాలానికి విక్రయించారు అనే అంశంపై ప‌న్ను ఆధార‌ప‌డి ఉంటుందనే విషయం గుర్తించుకోవాలి. బంగారాన్ని కొనుగోలు చేసిన మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్ప కాలంగానూ.. మూడేళ్లు మించితే దీర్ఘకాలంగానూ పరిగణించి మూలధన లాభంపై పన్ను విధిస్తారు. స్వల్పకాల మూలధన లాభాలను (ఎస్‌టీసీజీ) ప‌న్ను చెల్లించాల్సిన ఆదాయానికి చేర్చి వ్యక్తికి వర్తించే స్లాబ్‌ రేటు ప్రకారం పన్ను విధిస్తారు. దీర్ఘకాల మూలధన లాభంపై 20శాతం + 4శాతం సెస్ వ‌ర్తిస్తుంది. స‌ర్‌ఛార్జ్ అద‌నం. అంతేకాకుండా భౌతిక బంగారం కొనుగోలు స‌మ‌యంలో 3 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. న‌గ‌ల రూపంలో కొనుగోలు చేస్తే త‌యారీ ఛార్జీలూ వ‌ర్తిస్తాయి. భౌతిక బంగారాన్ని విక్రయించే సమయంలో టీడీఎస్‌ వర్తించదు. కానీ రూ.2లక్షల పైన నగదు రూపంలో చెల్లించి బంగారం కొనుగోలు చేస్తే ఒక శాతం టీడీఎస్‌ వర్తిస్తుంది.

డిజిట‌ల్ గోల్డ్‌:

డిజిట‌ల్ బంగారానికి కూడా భౌతిక బంగారానికి వ‌ర్తించిన‌ట్లే కాల‌వ్యవధిపై ఆధారపడి పన్ను వర్తిస్తుంది. బంగారాన్ని మూడేళ్ల తర్వాత విక్రయిస్తే ఎల్‌టీసీజీగా ప‌రిగణించి 20శాతం ప‌న్ను+ సెస్‌, సర్‌ఛార్జీ విధిస్తారు. అయితే డిజిట‌ల్ గోల్డ్‌లో స్వల్పకాల రాబడిపై డైరెక్ట్‌గా పన్ను విధించరు. చాలా త‌క్కువ మొత్తంతో అంటే క‌నీసం రూ.1 నుంచే డిజిటల్ బంగారంలో పెట్టుబ‌డులు ప్రారంభించవ్చు.

పేప‌ర్ గోల్డ్‌:

గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు, సార్వభౌమ ప‌సిడి బాండ్లు (ఎస్‌జీబీ) ఇందులోకి వ‌స్తాయి. పేప‌ర్ రూపంలో బంగారం ఉంటుంది. భౌతికంగానూ బంగారాన్ని పొందొవచ్చు. వీటిలో గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లకు భౌతిక బంగారం మాదిరిగానే పన్ను విధిస్తారు. మూడు సంవత్సరాలకు మించి కొన‌సాగిస్తే ఎల్‌టీసీజీ పన్ను 20శాతం+ 4 శాతం సెస్ వ‌ర్తిస్తుంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను ఎప్పుడైనా ఎక్స్‌ఛేంజ్‌ల్లో అమ్మవచ్చు. అందుకే సార్వభౌమ పసిడి బాండ్ల కంటే గోల్డ్ ఫండ్లు లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల‌లో లిక్విడిటీ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే, సార్వభౌమ పసిడి పథకాలపై వ‌ర్తించే పన్ను కాస్త భిన్నంగా ఉంటుంది. సార్వభౌమ పసిడి పథకాల్లో పెట్టిన పెట్టుబడిపై వార్షికంగా 2.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇది మీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయానికి చేర్చి వ‌ర్తించే స్లాబ్‌ రేటు ప్రకారం ప‌న్ను విధిస్తారు. అయితే ఈ బాండ్లకు 8 సంవ‌త్సరాల కాలపరిమితి ఉంటుంది. ఆ కాల‌ప‌రిమితి పూర్తయ్యే వరకు పెట్టుబ‌డులు కొనసాగిస్తే లాభాల‌పై ప‌న్ను ఉండ‌దు. ఇందులో 5 సంవ‌త్సరాల లాకిన్‌ పిరియడ్‌ ఉంటుంది. 5 సంవ‌త్సరాల తర్వాత ముంద‌స్తు విత్‌డ్రాల‌ను అనుమతిస్తారు.

గోల్డ్ డెరివేటీవ్‌:

గోల్డ్ డెరివేటీవ్‌లపై వ‌ర్తించే ప‌న్ను భిన్నంగా ఉంటుంది. గోల్డ్ డెరివేటీల నుంచి వ‌చ్చే రాబ‌డిని వ్యాపారంపై వ‌చ్చే ఆదాయంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సంస్థ మొత్తం ట‌ర్నోవ‌ర్ రూ. 2 కోట్ల కంటే త‌క్కువ ఉంటే 6 శాతం ప‌న్ను విధిస్తారు. ఇది ఆయా సంస్థల‌కు ప‌న్ను భారాన్ని త‌గ్గిస్తుంది. అయితే, టర్నోవర్ రూ.2 కోట్లకు పైగా ఉంటే దానిని వ్యాపార ఆదాయంగా చేర్చలేము.

బ‌హుమ‌తిగా బంగారం:

త‌ల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లల నుంచి బ‌హుమ‌తిగా బంగారం స్వీక‌రించినట్లయితే ఆ బంగారంపై ప‌న్ను వ‌ర్తించ‌దు. కానీ ఇత‌రుల నుంచి బంగారాన్ని బ‌హుమ‌తిగా పొంది.. దాని విలువ రూ.50వేల కంటే ఎక్కువ ఉంటే వారికి వ‌ర్తించే వ్యక్తిగత ప‌న్ను స్లాబ్ ప్రకారం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ బంగారం విలువ రూ.50వేల కంటే త‌క్కువ ఉంటే ఎటువంటి ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రమూ లేదు.

SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!

Jio Cashback Offer: జియో బంపర్‌ ఆఫర్‌.. రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌.. ఏయే ప్లాన్స్‌పై అంటే..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు