AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Cashback Offer: జియో బంపర్‌ ఆఫర్‌.. రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌.. ఏయే ప్లాన్స్‌పై అంటే..!

Jio Cashback Offer: కస్టమర్లను మరింతగా ఆకట్టకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌..

Jio Cashback Offer: జియో బంపర్‌ ఆఫర్‌.. రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌.. ఏయే ప్లాన్స్‌పై అంటే..!
Subhash Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 29, 2021 | 11:48 AM

Share

Jio Cashback Offer: కస్టమర్లను మరింతగా ఆకట్టకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. ప్రీపెయిడ్ యూజర్ల కోసం అత్యంత ఆకర్షణీయమైన ప్లాన్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవలే ఒక ఏడాది కాలపరిమితి గల డిస్నీ+హాట్‌స్టార్‌ ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిచయం చేసింది.

జియో రీఛార్జ్‌లపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌..

తాజాగా రిలయన్స్ జియో కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లపై 20 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందాలంటే యూజర్లు MyJio యాప్ లేదా Jio అధికారిక వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో యూజర్లు రూ.249, రూ.555, రూ. 599 రీఛార్జ్ ప్లాన్‌లపై క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

క్యాష్‌బ్యాక్ మనీ యూజర్ల ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఈ మొత్తం తదుపరి రీఛార్జ్‌ల కోసం ఉపయోగించవచ్చు. రిలయన్స్ జియో వెబ్‌సైట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేసుకునే యూజర్ల కోసం ప్రత్యేకంగా 20 శాతం క్యాష్‌బ్యాక్ సెక్షన్ తీసుకొచ్చింది. ఈ కొత్త వెబ్‌సైట్ విభాగంలో రూ. 249, రూ .555, రూ. 599 మూడు రీఛార్జ్ ప్యాక్‌లు ఉన్నాయి. వీటిపై మీరు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ప్లాన్స్‌ వివరాలు..

కాగా, రూ. 249 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందవచ్చు. యూజర్లు డేటా లిమిట్ పూర్తిగా యూజ్ చేసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ యూజ్ చేయవచ్చు. రూ. 555 ప్లాన్ 84 రోజుల వాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తుంది. రూ.599 రీఛార్జ్ ప్లాన్ కూడా అదే తరహా బెనిఫిట్స్‌ను అందిస్తుంది. అయితే ఇందులో రోజుకు 2జీబీ డేటా అందిస్తుంది.

ఈ మూడు ప్లాన్‌లలో జియోటీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీతో సహా మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ లను రీచార్జ్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్ కు 20 శాతం క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది.

క్యాష్‌బ్యాక్‌ ఎలా పొందాలంటే..

రీచార్జ్‌ కోసం ముందుగా jio.com విజిట్ చేసి ప్రీపెయిడ్ అండ్ పాపులర్ ప్లాన్‌లపై క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్లు 20శాతం క్యాష్‌బ్యాక్ ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తుంది. రూ. 249, రూ.555, రూ.599 రీఛార్జ్ ప్లాన్‌ల లిస్ట్ కనిపిస్తుంది. తర్వాత ‘Buy’ పై క్లిక్ చేయండి. మీ జియో ఫోన్ నంబర్ నమోదు చేసి పేమెంట్ మెథడ్స్ సెలెక్ట్ చేయండి. మీరు పేమెంట్ చేశాక మీ రీఛార్జ్ పూర్తవుతుంది. తరువాత 20శాతం క్యాష్‌బ్యాక్ వెంటనే మీ జియో ఖాతాకు జమ అవుతుంది.

ఇవీ కూడా చదవండి:

No Cost EMI: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

Google: దిగి వచ్చిన గూగుల్‌.. క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ పర్సంటేజీలపై సంచలన నిర్ణయం..!