Google: దిగి వచ్చిన గూగుల్‌.. క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ పర్సంటేజీలపై సంచలన నిర్ణయం..!

Google:  టెక్‌ దిగ్గజ కంపెనీల మీద గత కొన్నిరోజులుగా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూజర్ల డాటాకు భద్రత కరువైందని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయన్న..

Google: దిగి వచ్చిన గూగుల్‌.. క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ పర్సంటేజీలపై సంచలన నిర్ణయం..!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 8:25 AM

Google:  టెక్‌ దిగ్గజ కంపెనీల మీద గత కొన్నిరోజులుగా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూజర్ల డాటాకు భద్రత కరువైందని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే నైతిక విలువలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో యాప్‌ మార్కెట్‌, డెవలపర్స్‌ నుంచి గూగుల్‌ అడ్డగోలు కమిషన్‌ వసూలు చేస్తుందనే ఆరోపణల మీద దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా గూగుల్‌ క్లౌడ్‌ మార్కెట్‌ప్లేస్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ను ఇతరుల నుంచి కొనుగోలు చేసినప్పుడు కూడా గూగుల్‌ కొంత పర్సంటేజ్‌ తీసుకుంటూ వస్తోంది. అయితే ఇది అడ్డగోలుగా వసూలు చేస్తోన్నట్లు విమర్శ ఉంది.

ఒక్కసారిగా తగ్గించిన పర్సంటేజీ..

ఈ నేపథ్యంలో గూగుల్‌ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ పర్సంటేజ్‌ను ఒక్కసారిగా 20 శాతం నుంచి 3 శాతానికి తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. గూగుల్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్యవర్తులకు భారీగా ఊరట లభించనుంది. పోటీ ప్రపంచంలో ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం, మిగతా కంపెనీలకూ అవకాశం ఇస్తూ పోటీతత్వాన్ని ప్రొత్సహించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని గూగుల్‌ ప్రకటించుకుంది

వార్షికాదాయంలో సగం ఫీజు మాత్రమే..

కాగా, ఈ ఏడాది మొదట్లో డెవలపర్స్‌ వార్షిక ఆదాయంలో మొదటి 1 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. ఏడుకోట్లకుపైనే) నుంచి సగం ఫీజు మాత్రమే యాప్‌ స్టోర్‌ సేవల కోసం వసూలు చేస్తామని గూగుల్‌ నిర్ణయించింది. అయితే గూగుల్‌ కంటే ముందే యాపిల్‌.. గత ఏడాది నవంబర్‌లో పైనిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరుసగా వస్తున్న విమర్శల నేపథ్యంలో జూలై 1 నుంచి యాప్‌ స్టోర్‌ ఫీజులను 30 నుంచి 15 శాతానికి తగ్గించినట్లు గూగుల్‌ తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Bitcoins Forgotten Passwords: పాస్‌వర్డ్‌ మర్చిపోవడంతో క్లెయిమ్‌ చేసుకోలేని రూ.10 లక్షల కోట్లు

Work From Home: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. కంపెనీల కొత్త వ్యూహం.. ఉద్యోగులతో కొత్త తలనొప్పులు..!