AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Work From Home: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. కంపెనీల కొత్త వ్యూహం.. ఉద్యోగులతో కొత్త తలనొప్పులు..!

Work From Home: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరూ వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో..

Work From Home: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌.. కంపెనీల కొత్త వ్యూహం.. ఉద్యోగులతో కొత్త తలనొప్పులు..!
Subhash Goud
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 27, 2021 | 8:52 AM

Share

Work From Home: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులందరూ వర్క్‌ఫ్రం హోమ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో ఉద్యోగులతో కొన్ని కంపెనీలు ఆఫీస్‌ నుంచే పనులను కొనసాగిస్తున్నాయి. ఇక మిగతా కంపెనీలు కూడా త్వరలోనే కార్యాలయాల నుంచి ఉద్యోగం చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి చెప్పాలని కంపెనీలు భావిస్తున్న తరుణంలో.. ఉద్యోగులు మాత్రం కార్యాలయాలకు వచ్చేందుకు ససేమీరా చెబుతుండటంతో కంపెనీలకు కొత్త తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే కమర్షియల్‌ కార్యకలాపాలు నిలిచిపోగా, బిల్డింగ్‌ల అద్దె చెల్లింపులు, ఇతరత్ర మెయింటెనెన్స్‌ ఖర్చులతో భారీగా నష్టపోయిన కంపెనీలు.. ఇక మీదట భరించేందుకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలోనే ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు కొత్త స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాయి.

ఇక టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) .. వర్క్‌ఫ్రమ్‌ హోంలో ఉద్యోగులను వీలైనంత త్వరగా కార్యాలయాలకు రప్పించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ ఏడాది చివరికల్లా లేదంటే వచ్చే ఏడాది జనవరి నుంచి కార్యాలయాల్లో ఉద్యోగుల సందడిని పెంచేదిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా ఉద్యోగులు ఆఫీసుకు రావాలనే ఆసక్తి చూపిస్తున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తోంది కూడా. అంతేకాదు ఉద్యోగులకు ఆరోగ్య భద్రత, శుభ్రతతో కూడిన కార్యాలయం వాతావరణం అందిస్తామని హామీతో పాటు రాబోయే కాలంలో కచ్చితంగా వర్క్‌ఫ్రమ్‌ హోం అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇస్తోంది కంపెనీ.

గూగుల్‌, మైక్రోసాఫ్ట్, యాపిల్‌ లాంటి టెక్‌ దిగ్గజ కంపెనీలు.. వర్క్‌ఫ్రమ్‌ హోంకు ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మెయిల్స్‌ ద్వారా ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి రాజీనామాల బెదిరింపులు కూడా ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తలొగ్గుతున్న కంపెనీలు.. వర్క్‌ఫ్రమ్‌ ఆఫీస్‌ను కొంతకాలం వాయిదా వేయడంతో పాటు ‘జీతం కోత’ నిబంధనల మీద వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు ఉద్యోగులకు అనుమతులు ఇస్తున్నాయి. కానీ, టీసీఎస్‌ ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. రియల్‌ టైం ఆఫీస్‌ వర్క్‌ ద్వారా ఎక్కువ ప్రొడక్టివిటీని సాధించేందుకు మొగ్గు చూపుతోంది. ఉద్యోగుల పట్ల కఠినంగా కాకుండా.. సున్నితంగా వ్యవహరిస్తూ వాళ్లను కార్యాలయాలకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. వ్యాక్సినేషన్‌ సహా అన్నిరకాల భద్రతల హామీ ఇస్తుండడంతో.. ప్లాన్‌ విజయవంతం అవుతోంది. ఇందుకోసం ఐబీఎం తరహా ప్రణాళికను టీసీఎస్‌ అనుసరిస్తుండటం విశేషం.

ఉద్యోగ, ఆరోగ్య భద్రతకు హామీ..

ఉద్యోగ, ఆరోగ్య భద్రతకు హామీ ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా జీతల పెంపు, ఇతర అలవెన్సులు ఇస్తామనే ప్రకటన. ప్రోత్సాహకాలు, నజరానాలు, అదనంగా టూర్లు, ఫ్యామిలీ ప్యాకేజీ టూర్ల ఆఫర్‌. అలాగే షిప్ట్‌మేనేజ్‌మెంట్‌.. ఉద్యోగికి తగ్గట్లు ఫ్లెక్సీబిలిటీ, ఎప్పటికప్పుడు ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం, వర్క్‌స్పేస్‌ ప్లానింగ్‌, అత్యవసరమైతే వర్క్‌ఫ్రమ్‌ హోంకి కొన్నాళ్లపాటు అనుమతి ఇస్తుండటం వంటి ఆఫర్లు ఇస్తోంది. కాగా, వీలైనంత త్వరగా 80 నుంచి 90 శాతం ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు టీసీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌జీ సుబ్రమణియం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ

Salary Hike: ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు.. ఏ రంగాల వారికి అంటే..