Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ

SBI Customers Alert: స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను లావాదేవీలకు సంబంధించిన అంశాలలోనే కాకుండా ఇతర అంశాలపై కూడా కస్టమర్లను..

SBI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ
Follow us
Subhash Goud

|

Updated on: Sep 25, 2021 | 8:28 PM

SBI Customers Alert: స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను లావాదేవీలకు సంబంధించిన అంశాలలోనే కాకుండా ఇతర అంశాలపై కూడా కస్టమర్లను అలర్ట్‌ చేస్తోంది. లావాదేవీలలో జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు వినియోగదారులను ట్వీటర్‌ ద్వారా హెచ్చరిస్తూ వస్తోంది. ఇక కొన్ని యాప్స్‌ గురించి కూడా కస్టమర్లను అలర్ట్‌ చేస్తోంది. యాప్స్‌ల వల్ల మోసగాళ్లు మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను దోచుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మీ మొబైల్‌కు ఏదైనా లింక్‌లు వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

ఈ నాలుగు యాప్స్‌ను తొలగించండి:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నాలుగు యాప్స్ గురించి ఈ హెచ్చరిక జారీ చేసింది. ఎస్‌బీఐ కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడవద్దని అలర్ట్ జారీచేసింది. ఎందుకంటే ఇప్పటికే ఈ నాలుగు యాప్స్‌ కారణంగా 150 మందికిపైగా 70 లక్షలకుపైగా పోగొట్టుకున్నారని సూచిస్తోంది. ఈ యాప్స్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్లయితే చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఈ యాప్స్‌ మొబైల్‌లో ఉంటే మోసగాళ్లు మీ అకౌంట్‌ను ఖాళీ చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి యాప్స్‌ల ద్వారా కస్టమర్లను మోసగిస్తున్నారని ఎస్‌బీఐ పేర్కొంది. అందుకే నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని ఆ యాప్స్‌ ఏమిటో తెలియజేసింది. AnyDesk, quick Support, team Viewer మరియు Mingle View వంటి యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని సూచించింది. ఒక వేళ ఇప్పటికే మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే వెంటనే తొలగించాలని ఎస్‌బీఐ సూచించింది.

అంతేకాకుండా ఏదైనా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి యూపీఐ (UPI) కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలియజేసింది. ఏదైనా సహాయం కోసం ఎస్‌బీఐ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది.

ఇవీ కూడా చదవండి: