AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy M52 5G: 5జీ సపోర్ట్‌తో శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!

Samsung Galaxy M52 5G: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ పలు మొబైల్‌ తయారీ కంపెనీలు..

Samsung Galaxy M52 5G: 5జీ సపోర్ట్‌తో శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!
Subhash Goud
|

Updated on: Sep 25, 2021 | 9:48 PM

Share

Samsung Galaxy M52 5G: ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ పలు మొబైల్‌ తయారీ కంపెనీలు కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ తన గెలాక్సీ సిరీస్‌లో భాగంగా కొత్త శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌52 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారతీయ మార్కెట్లలోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం పోలాండ్‌లో విడుదల కాగా, బ్లాక్‌, బ్లూ, వైట్‌ కలర్‌ వేరియంట్లో శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌52 ఉండనుంది. ఇక భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 32, 900 ఉండవచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో సెప్టెంబర్‌ 28 నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

శాంసంగ్‌ గెలాక్సీ ఎమ్‌52 5జీ ఫీచర్స్‌:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది సంస్థ. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో రకరకాల స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు అద్భుతమైన ఫీచర్స్‌తో ఫోన్‌లను విడుదల చేస్తుండగా, శాంసంగ్‌ కంపెనీ కూడా ఈ మొబైల్‌లో ఎన్నో ఫీచర్స్‌తో తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన శాంసంగ్‌ కంపెనీ.. తాజాగా ఈ ఫోన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 778 ప్రాసెసర్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమ్లోడ్‌ ప్లస్‌ డిస్‌ప్లే ఉండనుంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 64 ఎమ్‌పీ రియర్‌ కెమెరా, 12 ఎమ్‌పీ ఫ్రంట్‌ కెమెరా, టైప్‌ సీ సపోర్ట్‌ చేయనుంది. అలాగే బ్యాటరీ విషయానికొస్తే.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో 25వాట్‌ ఛార్జింగ్‌ సపోర్టు చేయనుంది.

ఇవీ కూడా చదవండి:

BI Customers Alert: మీ మొబైల్‌లో ఈ నాలుగు యాప్స్‌ ఉన్నాయా..? వెంటనే డిలీట్‌ చేయండి: ఎస్‌బీఐ

Nokia G50: మార్కెట్లోకి నోకియా 5జీ స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..