AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia G50: మార్కెట్లోకి నోకియా 5జీ స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..

Nokia G50: ప్రస్తుతం కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి..

Nokia G50: మార్కెట్లోకి నోకియా 5జీ స్మార్ట్‌ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. ధర ఎంతంటే..
Subhash Goud
|

Updated on: Sep 24, 2021 | 9:52 PM

Share

Nokia G50: ప్రస్తుతం కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు మార్కెట్లో రకరకాల స్మార్ట్‌ఫోన్లు విడుదలవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు మొబైల్‌ కంపెనీలు. ఒకప్పుడు బేసిక్, ఫీచర్ మోడళ్లతో ఓ వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు 4జీ, 5జీ ఫోన్‌లతో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవల మార్కెట్లో ఎక్స్‌ఆర్‌20ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నోకియా.. ఇప్పుడు నోకియా జీ సిరీస్‌లో 5జీ ఫస్ట్‌ ఫోన్‌ని భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ యూకే మార్కెట్‌లో అందుబాటులో ఉండగా, మరికొన్ని రోజుల్లో భారత మార్కెట్లో విడుదల కానుంది.

నోకియా జీ50 ఫీచర్స్‌..

నోకియా జీ50 ఫోన్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో మార్కెట్లో విడుదల కానుంది. 6.82 అంగుళాల డిస్‌ప్లే, బ్రైట్‌నెస్‌ కోసం 450నిట్స్‌, 4 జీబీ ర్యామ్‌, క్వాల్‌కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 480ఎస్‌ఓఎస్‌,48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్‌ రేర్‌ కెమెరా సెటప్‌ ఉండనుంది. అలాగే 5మెగా పిక్సెల్‌ ఆల్ట్రా వైడ్‌ షూటర్‌, 2మెగా పిక్సల్‌​డెప్త్‌ సెన్సార్‌, 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా సెన్సార్‌తో అందుబాటులోకి రానుంది. 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాల్ట్‌ల ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ చేయనుంది. 64జీబీ ఇంట్రనల్‌ కెమెరా, 512జీబీ వరకు మైక్రో ఎస్‌డీ కెమెరా,4జీ, 5జీ నెట్‌వర్క్‌లకు కనెక్టివిటీ ఆప్షన్‌, వైఫై 802.11ఏసీ, వీ5.0 బ్లూటూత్‌, జీపీఎస్‌-ఏజీపీఎస్‌ ట్రాకర్‌,ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ, టైప్‌సీ పోర్ట్‌, సెన్సార్లను రిసీవ్‌ చేసుకునేందుకు యాంబీనెట్‌ లైట్‌, ఫోన్‌ ఆటో రొటేట్‌ కోసం జిరోస్కోప్‌ ఫీచర్లను యాడ్‌ చేసింది కంపెనీ.

ధర ఎంతంటే..

నోకియా జీ50 4జీబీ ర్యామ్‌ 64 ఇంట్రనల్‌ స్ట్రోరేజ్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర యూకే మార్కెట్‌లో రూ.20 వేలల్లో లభించనుంది. మిడ్‌నైట్‌ సన్‌, బ్లూ ఓషన్‌ కలర్స్‌లో లభ్యం కానుంది. ప్రస్తుతం ఈ 5జీ ఫోన్‌ యూకే మార్కెట్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తుండగా.. మరోవైపు అఫార్డ్‌బుల్‌ ప్రైస్‌లో 4జీ మోడల్‌ ఫోన్‌లు నోకియా జీ10,నోకియా జీ20 ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇవీ కూడా చదవండి:

WhatsApp Cashback: వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు.. ఒక్కసారి పేమెంట్‌ చేస్తే..!

TRAI: వోడాఫోన్‌ ఐడియాకు గుడ్‌బై చెప్పేస్తున్న కస్టమర్లు.. ఎందుకు ఈ నిర్ణయం..?

ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..
ఆ స్టార్ హీరో ఒక్కరినే నాగార్జున 'అన్న' అని పిలుస్తారు..