- Telugu News Photo Gallery Technology photos Amazon Great Indian Festival 2021 Will Begin From October 4th
Amazon Great Indian: అమెజాన్ షాపింగ్ పండుగ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచో తెలుసా.? వేటిపై ఆఫర్లు ఉన్నాయంటే..
Amazon Great Indian: పండుగ సీజన్ వస్తుందంటే చాలు ఈ-కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లు తీసుకొస్తాయి. ఇందులో భాగంగానే ప్రత్యేక పేర్లతో ఆఫర్లను అందిస్తుంటాయి. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే..
Updated on: Sep 24, 2021 | 10:58 PM

పండుగ సీజన్ వస్తుందంటే చాలు ఈ-కామర్స్ సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లు తీసుకొస్తాయి. ఇందులో భాగంగానే ప్రత్యేక పేర్లతో ఆఫర్లను అందిస్తుంటాయి. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. 2021 అక్టోబర్ 4 నుంచి ఈ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానునట్లు అమెజాన్ ప్రకటించింది.

ఈ విషయాన్ని అమెజాన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. అక్టోబర్ 4 నుంచి సేల్ ప్రారంభం కానుండగా ఏకంగా నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది.

ఇక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమెజాన్ పలు ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించనున్నట్లు సమచారం.

సేల్‌లో భాగంగా వివిధ మొబైల్ ఫోన్ మోడల్స్, యాక్ససరీలు, స్మార్ట్ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు సహా గృహోపకరణాలపై డిస్కౌంట్లను సూచించే మైక్రోసైట్ రూపొందించింది.

అమెజాన్ ఎకో, ఫైర్ స్టిక్, కిండ్లే డివైజ్‌లనూ తక్కువ ధరకే అందించనుంది. దీంతో పాటు యాపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, శాంసంగ్, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్‌లో భాగంగా లాంచ్ చేయనున్నారు.





























