Narender Vaitla | Edited By: Ravi Kiran
Updated on: Sep 24, 2021 | 6:40 AM
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ శుక్రవారం చైనాలో ఐక్యూ జెడ్5 ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 778జీ ఎస్‌వోసీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను అందించారు.
ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. దీంతో పాటు యూఎస్‌బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఫేస్‌వేక్ ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణ.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర సుమారు రూ.21,600 కాగా.. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.26,200గా ఉంది.