- Telugu News Photo Gallery Business photos Vodafone Idea lost 14.3 lakh customers in July, the number of subscribers of Jio and Airtel increased
TRAI: వోడాఫోన్ ఐడియాకు గుడ్‌బై చెప్పేస్తున్న కస్టమర్లు.. ఎందుకు ఈ నిర్ణయం..?
TRAI: టెలికాం రంగంలో పోటీ మరింతగా పెరిగిపోతోంది. వివిధ టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. టెలికం ..
Updated on: Sep 24, 2021 | 8:32 PM

TRAI: టెలికాం రంగంలో పోటీ మరింతగా పెరిగిపోతోంది. వివిధ టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతూ వినియోగదారులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. టెలికం రంగంలో తనదైన ముద్ర వేసుకుంటున్న జియోకు కస్టమర్ల భారీగా వచ్చి చేరుతున్నారు.

టెలికం దిగ్గజాల్లో ఒకటైన వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌కు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ నెట్‌వర్క్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థ కస్టమర్లు వీడుతుండటంతో మరింత ఇబ్బందుల్లో పడిపోతోంది.

జూలై నెలలో వొడాఫోన్ ఐడియాకు 14.3 లక్షల మంది యూజర్లు గుడ్‌బై పలికినట్లు టెలిక రెగ్యులేటరీ ట్రాయ్ తాజాగా వెల్లడించింది. ఇదే నెలలో దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీ అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లలో లక్షలాది మంది చేరిపోతున్నారు.

జూలైలో జియో నెట్‌వర్క్‌లోకి 65.10 లక్షల మంది కస్టమర్లు చేరగా, భారతీ ఎయిర్‌టెల్‌లోకి 19.42 లక్షల మంది కస్టమర్ల చేరినట్లు ట్రాయ్ వెల్లడించింది. టెలికం రంగంలో దూసుకుపోతున్న జియోకు మరింత మంది కస్టమర్లు చేరువవుతున్నారు.

దీంతో జియో 44.32 కోట్ల మంది వినియోగదారులతో మొదటి స్థానంలో నిలిచింది. 35.40 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లతో ఎయిర్‌టెల్ ఆ తర్వాతి స్థానంలో ఉండగా, 27.19 కోట్ల మందితో వొడాఫోన్ మూడో స్థానంలో నిలిచింది.

గత కొన్ని రోజులుగా వోడాఫోన్ ఐడియాకు కస్టమర్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. జియో, ఎయిర్‌టెల్ తన కస్టమర్లను చేర్చుకునేందుకు సరికొత్త ఆఫర్లు పెట్టడం, నెట్‌వర్క్ సరిగ్గా ఉండేలా చర్యలు చేపడుతూ నెట్‌వర్క్‌లో దూసుకుపోతున్నాయి. ముందే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వోడాఫోన్ ఐడియాకు కస్టమర్ల క్రమ క్రమంగా దూరమవుతున్నారు.





























