- Telugu News Photo Gallery Business photos Salary Hike Likely to be in Double Digit for These Employees Next Year. Details Here
Salary Hike: ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు.. ఏ రంగాల వారికి అంటే..
Salary Hike: గత ఏడాది కిందట వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దీని కారణంగా చాలా మంది ఉద్యోగాలు కూడా పోయాయి. ఇప్పుడిప్పుడు కరోనా నుంచి..
Updated on: Sep 25, 2021 | 6:56 PM

Salary Hike: గత ఏడాది కిందట వ్యాపించిన కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దీని కారణంగా చాలా మంది ఉద్యోగాలు కూడా పోయాయి. ఇప్పుడిప్పుడు కరోనా నుంచి కోలుకుని అన్ని రంగాలు తమ తమ కార్యాకలాపాలు నిర్వహిస్తున్ఆనయి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వచ్చే ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు ఉంటుందని ఓ సర్వే వెల్లడించింది. డెలాయిట్ వర్క్‌ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వేలో వచ్చే ఏడాది ఉద్యోగులకు 8.6 శాతం వేతనాల పెంపు ఉంటుందని తేలింది. ఒకవేళ ఇదే నిజమైతే 2022లో వేతనాల పెంపు కరోనా ముందు నాటి పరిస్థితి.. అంటే 2019 స్థాయికి చేరుకుంటుంది.

ఈ సర్వేలో 25 శాతం కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది ఉద్యోగులకు రెండంకెల శాతం వేతనాల పెంపు ఉంటుందని పేర్కొన్నాయి. సర్వేలో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2021లోనే దాదాపు 92 శాతం కంపెనీలు 8 శాతం ఇంక్రిమెంట్లు ఇచ్చాయి. 2020లో కేవలం 60 శాతం కంపెనీలు అది కూడా 4.4 శాతం మాత్రమే తమ ఉద్యోగులకు వేతనాలు పెంచాయి.

చాలా కంపెనీలు 2021తో పోల్చితే 2022లో ఎక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాయని డెలాయిట్ టచ్ టోహమట్సు ఇండియా ఎల్ఎల్‌పి పార్టనర్ అనంద్ రూప్ ఘోష్ పేర్కొన్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఇంకా కరోనా నుంచి కోలుకోవడానికి ఇబ్బందిపడుతున్నాయని అన్నారు.

అయితే సర్వేలో పాల్గొన్న కొన్ని కంపెనీలు మాత్రం 2021 ఇంక్రిమెంట్లు ముగిశాయని.. 2022 ఇంక్రిమెంట్ వ్యవహారం చాలా దూరంలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఇక వేతనాల పెంపు విషయంలో మిగతా రంగాల కంటే ఐటీ రంగం ముందుండే అవకాశం ఉంది. ఐటీ రంగం తరువాత ఫార్మా రంగం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిజిటల్ లేదా ఈ కామర్స్ రంగానికి అనుబంధంగా ఉండే ఐటీ కంపెనీలు రెండంకెల శాతం ఇంక్రిమెంట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు రీటైల్ రంగం, రెస్టారెంట్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు తక్కువ ఇంక్రిమెంట్లను ఆఫర్ చేయవచ్చు. అయితే ఈ రంగాల్లోని అందరూ ఉద్యోగులకు ఒకే రకమైన ఇంక్రిమెంట్ ఉండకపోవచ్చు.





























