Gold Sliver Rate Today: మహిళలకు గుడ్‌న్యూస్.. పడిపోయిన బంగారం ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజాగా ఎంత తగ్గిందంటే..!
Gold Sliver Rate Today: నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర.. నేడు పడిపోయింది. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని..
Gold Sliver Rate Today: నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర.. నేడు పడిపోయింది. ఒక రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్‌న్యూసే. దేశంలో బంగారం ధరల్లో ఎన్ని మార్పులు వచ్చినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480 ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,510 ఉంది.
► ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,040 ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.
► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,130 ఉంది.
► విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,130 ఉంది.
దీపావళి తర్వాత రూ.60 వేల వరకు..
కాగా, ప్రస్తుతం బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండగా, దీపావళి పండగ తర్వాత రూ.57 వేల నుంచి రూ.60 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే పసిడి బాటలోనే వెండి ధర కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ధరల పెరుగుదలకు కారణాలు ఏమిటి..?
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
తగ్గిన వెండి ధరలు..
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండిపై స్వల్పంగా దిగి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,100 ఉండగా, చెన్నైలో రూ.64,700 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,100 ఉండగా, కోల్‌కతాలో రూ.60,100 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,100 ఉండగా, కేరళలో రూ.64,700 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,700 ఉండగా, విజయవాడలో రూ. 64,700 వద్ద కొనసాగుతోంది.