ఈ కారు మే, 2018లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటి నుంచి కేవలం 19,800 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. వినియోగదారులు ఈ కారు పట్ల పెద్దగా ఆసక్తి చూపని కారణంగా విక్రయాలను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ యారిస్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు విడిభాగాలు సహా ఇతరత్రా సేవలు కనీసం వచ్చే 10 ఏళ్ల పాటు అందుతాయని టొయోటా హామీ ఇచ్చింది.