Amazon Great Indian: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరలో వస్తోన్న ల్యాప్‌టాప్‌లు ఇవే..

Amazon Great Indian Sale: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో భాగంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోన్న ఈకామర్స్‌ సంస్థ ల్యాట్‌టాప్‌లపై కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న బెస్ట్‌ ల్యాప్‌టాప్‌లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Sep 28, 2021 | 9:55 AM

పండుగల సీజన్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌ 4నుంచి ప్రారంభంకానున్న ఈ సేల్‌లో అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై బంపరాఫర్‌లు ఇస్తోంది.

1 / 6
ఈ క్రమంలోనే పలు ల్యాప్‌టాప్‌లపై కూడా అమెజాన్‌ మంచి ఆఫర్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 30వేలలోపు అందుబాటులో ఉన్న కొన్ని ల్యాప్‌టాప్‌లపై ఓ లుక్కేయండి..

2 / 6
హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌: 14 అంగుళాల స్క్రీన్‌తో రానున్న ఈ ల్యాప్‌టాప్‌ రూ. 27,990కి అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే, ఇంటెల్‌ సెలెరాన్‌ N4020 ప్రాసెసర్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256 జీబీ వరకు మెమొరీ పెంచుకునే అవకాశం కలిపించారు.

3 / 6
అసుస్‌ క్రోమ్‌బుక్‌ ఫ్లిప్‌: సెలెరాన్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 24,999కే అందిబాటులో ఉండనుంది. ఇందులో 11.6 అంగుళాల డిస్‌ప్లే అందించారు. 1.20 కిలోల బరువుతున్న ఈ క్రోమ్‌బుక్‌లో 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందించారు. ఇందులో క్రోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందిస్తున్నారు.

4 / 6
 లెనెవో వీ15 ఏఎమ్‌డీ: 15.6 అంగుళాల డిస్‌ప్లేతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎమ్‌డీ అథ్లాన్‌ గోల్డ్‌ 3150యూ ప్రాసెసర్ అందించారు. 4 జీబీ ర్యామ్‌తో పాటు 1టీబీ హెచ్‌డీడీ స్టోరేజ్‌ కెపాసిటీ దీని సొంతం. ఇక ఈ ల్యాప్‌ టాప్‌ ధర విషయానికొస్తే రూ. 29,990కి అమెజాన్‌ సేల్‌లో అందుబాటులోకి రానుంది.

5 / 6
లెనెవో ఐడియాపాడ్‌ స్లిమ్‌3: 15.6 అంగుళాల డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్‌ సెలెరాన్‌ N4020 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 4జీబీ ర్యామ్‌, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ అందించారు. 35 డబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 8 గంటలపాటు వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ రూ. 29,990కి అందుబాటులో ఉండనుంది.

6 / 6
Follow us