- Telugu News Photo Gallery Business photos SBI Offers: get 10 percent discount at amazon with sbi debit cards details inside
SBI Offers: మీరు ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో శుభవార్త.. ఏంటంటే..!
SBI Offers: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లు బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ..
Subhash Goud | Edited By: Ram Naramaneni
Updated on: Sep 29, 2021 | 11:47 AM

SBI Offers: దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్లు బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్ నేపథ్యంలో షాపింగ్ చేయాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది.

దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. ఫ్యాషన్ కేటగిరిపై మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. అలాగే కనీసం రూ.1500 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

పండగ సీజన్ ఆఫర్లలో భాగంగా.. షూ, వాచెస్, లగేజ్, దుస్తులు, బ్యూటీ ప్రొడక్టులు, జువెలరీ వస్తువులు ఇలా పలు రకాల ఫ్యాషన్ ప్రొడక్టులపై తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ మాస్టర్ కార్డు డెబిట్ కార్డు వాడే వారికి ఇది వర్తిస్తుంది. 10 శాతం తగ్గింపు పొందే అవకాశం లభిస్తుంది. ఈ నెల 30 వరకే ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

పండగ సీజన్ ఉండటంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్టులు వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు కూడా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేసిన వారికి కార్డును ఉపయోగించుకుంటే డిస్కౌంట్ అందిస్తోంది.





























