AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone Prices: భారత్‌లో ఐ ఫోన్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి..?

ఈ సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఐఫోన్ 15 బేస్ మోడల్ ధర. అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, జపాన్, థాయ్‌లాండ్ వంటి ఇతర ప్రాంతాల్లో ఈ సిరీస్ ఫోన్‌ల ధర భారతదేశంలో కంటే తక్కువగా ఉంది. అయితే వీటిలో కొన్ని ఫోన్లు భారతదేశంలోనే తయారు అవుతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో iPhone 15 Pro Max (1 టెరాబైట్) ధర రూ. 1,99,900 ఉంది. అయితే అమెరికాలో దీని ధర $ 1,599..

iPhone Prices: భారత్‌లో ఐ ఫోన్ ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి..?
Iphone
Subhash Goud
|

Updated on: Sep 20, 2023 | 6:26 PM

Share

యాపిల్‌ తన ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో నాలుగు వేర్వేరు ఫోన్‌లు తీసుకు వచ్చింది ఆపిల్. ఇందులో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్ష్‌ వంటివి ఉన్నాయి. కానీ వివిధ దేశాలలో ఈ సిరీస్ ఫోన్‌ల ధరలలో చాలా తేడా ఉంది. భారతదేశంలో, ఈ ఫోన్‌లు ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఖరీదైనవి. దేశీయ మార్కెట్లో iPhone 15 సిరీస్ ఫోన్‌ల ధర రూ. 79,900 నుంచి ప్రారంభమవుతుంది. అది ఈ సిరీస్‌లో అత్యంత చవకైన ఫోన్ ఐఫోన్ 15 బేస్ మోడల్ ధర. అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, జపాన్, థాయ్‌లాండ్ వంటి ఇతర ప్రాంతాల్లో ఈ సిరీస్ ఫోన్‌ల ధర భారతదేశంలో కంటే తక్కువగా ఉంది. అయితే వీటిలో కొన్ని ఫోన్లు భారతదేశంలోనే తయారు అవుతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో iPhone 15 Pro Max (1 టెరాబైట్) ధర రూ. 1,99,900 ఉంది. అయితే అమెరికాలో దీని ధర $ 1,599, అంటే భారతీయ కరెన్సీలో చూస్తే రూ. 1,32,717 ఉంది. అంటే అమెరికా ధరలతో పోలిస్తే భారతదేశంలో ఈ ఫోన్ ధర 50 శాతం కంటే ఎక్కువ. మనం iPhone 15 గురించి చూస్తే కనుక భారతదేశంలో దీని ధర రూ. 79,900గా ఉంది. అదే అమెరికాలో అయితే దీని ధర 799 డాలర్లు, అంటే రూ. 66,317. దుబాయ్‌లో 3,399 UAE దిర్హామ్‌లు, అంటే మన కరెన్సీలో రూ. 76,817గా ఉంది.

ధరలలో ఈ వ్యత్యాసం ఐఫోన్‌ 15 సిరీస్‌తో మాత్రమే కాదు. యాపిల్‌ ఇతర ఫోన్‌లు అలాగే ప్రోడక్ట్స్ కూడా మనదేశంలో ఖరీదైనవి అని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాల ఉన్నాయి. భారతదేశంలో యాపిల్‌ ఉత్పత్తులపై విధించిన అధిక దిగుమతి సుంకం ఒక కారణం. ప్రో మోడల్‌లపై 22 శాతం దిగుమతి సుంకం విధించారు. కాంపోనెంట్స్‌పై కస్టమ్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ ఛార్జీ, 18 శాతం జీఎస్టీ అలాగే ఇతర దేశాలతో పోలిస్తే ఐఫోన్ అసెంబ్లింగ్ ఖర్చు మన దేశంలో ఎక్కువ. ఇలా దేశంలో యాపిల్‌ ఉత్పత్తులను మరింత ఖరీదైనదిగా మార్చడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇంకో పెద్ద కారణం భారత రూపాయి బలహీనత.. దీని కారణంగా దేశంలో ఐఫోన్‌లు ఖరీదైనవిగా మారుతున్నాయి. యాపిల్ 6 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. కానీ ఇప్పటికీ చైనాతో పోలిస్తే ఇక్కడ సరఫరా ఏమంత పెద్దది కాదు. ప్రొడక్టివిటీ కూడా చాలా చిన్నది. ఇది కాకుండా యాపిల్‌ భారతదేశంలోని రిటైలర్లు, డీలర్లు, పంపిణీదారుల ద్వారా అమ్మకాలు చేస్తుంది.

అమెరికాతో పోలిస్తే భారతదేశంలో వారి కమీషన్ ఎక్కువ. యాపిల్ ఫోన్లు ఇండియాలో తయారవుతున్నాయంటే ఇక్కడ ఆ మోడల్స్ ధరలు తక్కువగా ఉంటాయని అందరూ భావించారు. కానీ, అలా లేదు. ఎందుకంటే, యాపిల్ తన స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను ఇండియాలో విక్రయించేందుకు థర్డ్ పార్టీ తయారీదారులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీని వలన వారి కమీషన్ ఎక్కువ కావడంతో ఐఫోన్ ఎండ్ ప్రైజ్ మన దేశంలో ఎక్కువగా ఉంటోందని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి