Google: మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. వారు అలా చెయ్యొద్దంటే.. మీరు ఇలా చేయాలి.. లేకుంటే అంతే..

మనం ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్‎ను విరివిగా ఉపయోగిస్తాం. అందులోనూ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎక్కువగా వాడుతుంటాం...

Google: మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. వారు అలా చెయ్యొద్దంటే.. మీరు ఇలా చేయాలి.. లేకుంటే అంతే..
Google
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 04, 2021 | 8:05 PM

మనం ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్‎ను విరివిగా ఉపయోగిస్తాం. అందులోనూ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఎక్కువగా వాడుతుంటాం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు గూగులు సెర్చ్ ఇంజిన్ వాడుతుంటారు. వారందరికీ సంబంధించిన సమాచారాన్ని గూగుల్ సేకరిస్తుంటుంది. ఉత్తమ సేవల కోసం ఇలా చేస్తున్నట్లు గూగుల్ చెబుతోంది. ఉదాహరణకు యూజర్ సెర్చ్ హిస్టరీ, లొకేషన్, చూసే ప్రకటనలు, చూసే వీడియోలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను గూగుల్ మానిటర్ చేస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు మీ గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే గూగుల్ మీ సమాచారాన్ని సేకరించకుండా జాగ్రత్త పడడం శ్రేయస్కరం. ఇందుకు కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది. అదెలాగో తెలుసుకుందామా..

వెబ్‌ వెర్షన్‎లో మీ గూగుల్ ఖాతాలో యాక్టివిటీ కంట్రోల్స్ పేజీలో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా గూగుల్ మానిటరింగ్‌ను దాదాపు నియంత్రించవచ్చు. మీరు ఇప్పటికే మీ బ్రౌజర్‌లో గూగుల్‌ అకౌంట్‎లో లాగిన్ అయి ఉంటే.. మీ గూగుల్ అకౌంట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆపై మేనేజ్ “యువర్ గూగుల్ అకౌంట్” ఆప్షన్ పై క్లిక్ చేయండి. “సెర్చ్ గూగుల్ అకౌంట్” బార్‎లో యాక్టివిటీ కంట్రోల్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. అప్పుడు మీకు గూగుల్‌కు సంబంధించి ఆరు కేటగిరీలు కనిపిస్తాయి. స్క్రీన్‌పై టోగుల్ బటన్‌లను ఆన్ అండ్ ఆఫ్ చేయడం ద్వారా మీరు గూగుల్ ట్రాకింగ్‌ను నిలిపివేయవచ్చు. ముఖ్యంగా మొదటి రెండు కేటగిరీలు అయిన వెబ్, యాప్ యాక్టివిటీ, లొకేషన్ హిస్టరీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.

1. పేరుకు తగినట్టుగానే వెబ్, యాప్ యాక్టివిటీ అనేది క్రోమ్‎లో సైన్-ఇన్ చేసినప్పుడు మీరు వెబ్‌లో చేసే యాక్టివిటీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని గూగుల్ మానిటర్ చేస్తుంది.

2. గూగుల్ ఏం రికార్డు చేస్తుందో వివరంగా తెలుసుకోవడానికి.. వెబ్, యాప్ యాక్టివిటీ కేటగిరీలో “మేనేజ్ యాక్టివిటీ” క్లిక్ చేయండి.

3. తరువాత మీరు యూజ్ చేస్తున్న అన్ని అప్లికేషన్‌ల సమాచారాన్ని గూగుల్ మానిటర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు మీరు “ఫిల్టర్ బై డేట్ ప్రొడక్ట్” పై క్లిక్ చెయండి.

4. ఇక్కడ లాస్ట్ అవర్, లాస్ట్ డే అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన సమయంపై క్లిక్ చేసి.. ఆ సమయం వరకు గూగుల్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయండి.

5. సెర్చ్ యాక్టివిటీ పక్కనే ఉన్న త్రీ డాట్స్ పై క్లిక్ చేసి ఒక్కొక్క దాన్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు.

6. అయితే గూగుల్ సేకరించిన డేటా మొత్తం డిలీట్ చేయడానికి “Delete Activity By” ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. అందులో “ఆల్ టైం” ఆప్షన్ పై క్లిక్ చేసి డిలీట్ బటన్ పై నొక్కండి. దాంతో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది.

7. ఈ ప్లాట్‌ఫాంలో 3, 18, 36 నెలలకు సంబంధించిన మీ ఆన్ లైన్ యాక్టివిటీ గూగుల్ నుంచి ఆటోమేటిక్ గా డిలీట్ చేసుకోవాలంటే.. “Auto-delete” ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన టైం సెట్ చేసుకోవచ్చు.

ఇక గూగుల్ అసిస్టెంట్‎తో కూడా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఇది మీరు ఎటువంటి వాయిస్ కమాండ్ ఇవ్వకపోయినా దానంతట అదే టర్న్ ఆన్ అవుతుంది. ఇది మీ వాయిస్ ప్రతిక్షణం వినకుండా ఉండాలంటే గూగుల్ అసిస్టెంట్ సెట్టింగ్స్ మార్చుకోవాలి. అదెలాగో చూద్దాం..

1. ముందు “హేయ్ గూగుల్, ఓపెన్ అసిస్టెంట్ సెట్టింగ్స్” అని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో లేదా టాబ్లెట్ లో ఒక వాయిస్ కమాండ్ ఇవ్వండి.

2. తర్వాత “ఆల్ ఆప్షన్స్” లోని “జనరల్” ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

3. గూగుల్ అసిస్టెంట్ ఆఫ్/ఆన్ అనే టోగుల్ బటన్ ని ఆఫ్ చేస్తే సరిపోతుంది.

వాయిస్ కమాండ్ ఉపయోగించని వారు గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేసి “మోర్” పై క్లిక్ చేయండి. తర్వాత సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకొని.. గూగుల్ అసిస్టెంట్ ఆప్షన్ పై నొక్కండి. తర్వాత అసిస్టెంట్ డివైజెస్ సెక్షన్ లో “ఫోన్” అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి “గూగుల్ అసిస్టెంట్”

Read Also..  Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 534, నిఫ్టీ 159 పాయింట్ల వృద్ధి

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!