AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elcid Investments: ఇదేం బాహుబలి షేర్ మావా.! బాబోయ్‌.. ఒక్క రోజులో రూ.3 నుంచి ఏకంగా రూ. 2.36 లక్షలకు

ఇది నిజం.. నమ్మలేని నిజం.. మీ కళ్లను మాయ చేసే నిజం.. ఒక్క రోజులోనే రూ. 3 నుంచి రూ. 2.36 లక్షలకు చేరింది ఓ స్టాక్ ప్రైస్. దెబ్బకు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ స్టాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Elcid Investments: ఇదేం బాహుబలి షేర్ మావా.! బాబోయ్‌.. ఒక్క రోజులో రూ.3 నుంచి ఏకంగా రూ. 2.36 లక్షలకు
Ravi Kiran
|

Updated on: Oct 30, 2024 | 10:00 AM

Share

అట్టాంటి.. ఇట్టాంటి షేర్ కాదు ఇది.! బాహుబలి షేర్ మావా.. ఒక్క రోజులో ఏకంగా 66,92,535 శాతం ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పటిదాకా దేశంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ ‘MRF’ని చిటికెలో దాటేసింది. ప్రస్తుతం MRF షేరు ధర రూ.1,22,345.60 దగ్గర ఉండగా.. అదే సమయంలో ఈ స్టాక్ ఒక్క రోజులో 66,92,535 శాతం భారీగా పెరిగడమే కాదు.. రూ.3.53గా ఉన్న ప్రైస్.. ఏకంగా రూ.2,36,250కి చేరి రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ స్టాక్ మరేదో కాదు ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్టాక్.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

Elcid ఇన్వెస్ట్‌మెంట్స్ తన స్టాక్ ధర రెకగ్నిషన్ కోసం ప్రత్యేక వేలం నిర్వహించింది. కంపెనీకి సంబంధించిన అధిక బుక్ వాల్యూను పరిగణనలోకి తీసుకునేసరికి, ఒక్క రోజులోనే కంపెనీ షేరు ధర రూ.3.53 నుంచి రూ.2,36,250కి పెరిగింది. ఈ విధంగా Elcid కంపెనీ స్టాక్ ఇప్పుడు దేశంలో అత్యంత ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ భారత స్టాక్ మార్కెట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి కొత్త చరిత్రను లిఖించింది. నిన్న మొన్నటి వరకు Elcid ఇన్వెస్ట్‌మెంట్స్ అనే పేరు స్టాక్ మార్కెట్‌లో ఎవ్వరికీ తెలియదు. కానీ, ఒకే రోజులో 66,92,535 శాతం అసాధ్యమైన జంప్‌తో, Elcid ఇప్పుడు భారతదేశంలో అత్యంత ఖరీదైన స్టాక్‌గా మారింది. దేశ స్టాక్‌ మార్కెట్‌లో ఇంత భారీ పెరుగుదల మునుపెన్నడూ లేదు. ఈ సునామీ 2021 నాటి క్రిప్టోమేనియాను గుర్తు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

మరోవైపు ఈ అసాధారణమైన జంప్‌పై చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సోమవారం, స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE, NSE నిర్వహించిన పెట్టుబడి హోల్డింగ్ కంపెనీలలో ధరల రెకగ్నిషన్ కోసం నిర్వహించిన ప్రత్యేక వేలం ఫలితాలు విడుదలయ్యాయి. అందులో ఇది స్పష్టంగా వ్యక్తమైంది. 2011 నుంచి ఇప్పటి వరకు Elcid షేరు ధర రూ.2 నుంచి రూ.3 మధ్య ట్రేడ్ అవుతూ వచ్చింది. ఈ సమయంలో Elcid బుక్ వాల్యూ రూ.5,85,225గా ఉంది. దీని వల్ల, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ తమ వాటాలను విక్రయించడానికి ఇష్టపడలేదు. అందుకే చాలా కాలంగా కంపెనీ షేర్లలో ట్రేడింగ్ జరగకపోవడానికి ఇదే కారణం.

కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ, హోల్డింగ్ కంపెనీల బుక్ వాల్యూ విలువ మధ్య అంతరాన్ని తగ్గించడానికి, SEBI స్టాక్ ఎక్స్ఛేంజీలను ప్రత్యేక వేలం సెషన్‌ను నిర్వహించాలని కోరింది. లిస్టెడ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు, ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీలు చాలా వరకు తరచుగా వాటి బుక్ వాల్యూ కంటే చాలా తక్కువ ధరలకు ట్రేడ్ అవుతూ వచ్చాయి. ఈ వ్యత్యాసాన్ని లేకుండా చేయడానికే SEBI ఇలాంటి నిర్ణయం తీసుకుంది. Elcid ఇన్వెస్ట్‌మెంట్స్.. ఏషియన్ పెయింట్స్‌లో 1.28 శాతం వాటాను కలిగి ఉంది, దీని వాటా విలువ రూ. 3,616 కోట్లు, ఇది Elcid మొత్తం మార్కెట్ క్యాప్‌లో 80 శాతం. ఇక కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,725 కోట్లు.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..