Gold and Silver price today: దీపావళి వేళ పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. నేటి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

అయితే 2014 ఏడాది చివరి మూడు నెలల్లో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని ఎక్కువ చూపిస్తుండడంతో పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులతో ఏర్పడుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉన్న బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం..

Gold and Silver price today: దీపావళి వేళ పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. నేటి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2024 | 6:53 AM

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. ఓ వైపు వేగంగా పెరుగుతున్నాయి.. మరోవైపు బంగారం, వెండి ధరలు తగ్గుతూ నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అపరాజిత బంగారం 10 గ్రాములు 80 వేలు దాటింది. మరోవైపు బంగారం బాటాలో వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి.. కిలో వెండి లక్ష ను తాకింది. ఇలాగే సాగితే వచ్చే ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పై పైకి చేరుకోవచ్చు అని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. దేశంలో దేవ్ దీపావళి సందర్భంగా ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 లు పెరిగి ఈ రోజు రూ. 73,760 లు కొనసాగుతోంది. అదే సమయంలో ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,460లకు చేరుకుంది.

ఈ రోజు అంటే అక్టోబర్ 30 వ తేదీ బుధవారం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు ఉన్న బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం..

హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,760గా ఉంది. మంగళవారంతో పోల్చితే రూ.10 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో ప్యూర్ గోల్డ్ ధర రూ.80,460 లు గా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణం, పొద్దుటూరు లో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు

ఈ రోజు ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 7,3910 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం (999 బంగారం అని కూడా పిలుస్తారు) 10 గ్రాములకు రూ. 8,0610లుగా కొనసాగుతోంది.

చెన్నై లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.7,3760లు ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.8,0460 లు గా కొనసాగుతోంది.

ముంబైలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹ 7,3760 లు ఉండగా 24 క్యారెట్ల బంగారం (999 బంగారం అని కూడా పిలుస్తారు) 10 గ్రాముకు రూ. 8,0460 లుగా కొనసాగుతోంది.

దేశంలో వెండి ధరలు

పసిడి బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. బంగారం తర్వాత అత్యధికంగా కొనుగోలు చేసే లోహం వెండి. దీపావళి పండగ నేపధ్యంలో వెండి వస్తువుల కొనుగోలుకు ఆసక్తిని ఎక్కువ చూపిస్తున్నారు. అదే సమయంలో పెట్టుబడి విషయంలో కూడా వెండి ఒక నమ్మకమైన వస్తువుగా మారింది. ఈ నేపధ్యంలో దేశంలో వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధర కిలో స్వల్పంగా తగ్గింది. కిలో  రూ. 100 లు తగ్గి ఈ  రోజు కిలోగ్రాము రూ. 1,06,800 లుగా కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..