Gold Rate: ఆలసించినా ఆశాభంగం.. రానున్నవన్నీ గోల్డెన్ డేస్…

మిడిసిపడుతోంది పసిడి.. సామాన్యులకు భారంగా పెట్టుబడిదారులకు లాభంగా...ఎగసి ఎగసి పడుతోంది. బంగారం అమాంతంగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి..? అయితే ఈ సమయంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా.. డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Gold Rate: ఆలసించినా ఆశాభంగం.. రానున్నవన్నీ గోల్డెన్ డేస్...
Gold
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 30, 2024 | 1:08 PM

బంగారం ఇప్పుడు ఎంత లెవల్‌కు పోతోంది అంటే.. ఒకప్పుడు ప్లాటినం గోల్డ్‌ను చూసి ఎక్కిరించేది..కానీ ఇప్పుడు గోల్డ్ ప్లాటినాన్ని చూసి జాలి పడుతోంది.. వైదిస్ ఓన్లీ బంగారం. అంటే..ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఫర్ ఎవర్ అన్నట్టుగా బిజినెస్ జరగడమే. ప్లాటినం ఇప్పుడు 10గ్రాములు తిప్పికొడితే 30 వేలుండదు. కానీ బంగారం ధర.. వారం వారం వేలకు వేలు పెరుగుతూ..లకారం..అంటే లక్షమార్కును టచ్ చేసేందుకు పరుగులు తీస్తోంది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజు డాలర్‌కు కూడా లేదు. దాని అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతికి చుక్కలు కనిపిస్తున్నాయి..దాని రేంజ్‌ ఏలెవల్లో పెరుగుతోందంటే…2024లోనే ఏకంగా 31శాతం పెరిగింది. 2005నుంచి 2024వరకు దాని పెరుగదలశాతం 455. ఈరేంజ్‌లో పెరుగుతుందని ఎవరూ ఊహించలే.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే… 24క్యారెట్స్ 10గ్రాముల ధర రూ. 80450….  22క్యారెట్స్ 10గ్రాముల ధర రూ.70375… పసిడి ప్రియులు చాలా కాలంగా బంగారం ధరలు తగ్గుతాయని ఆశిస్తూ.. కొనేందుకు ఎదురుచూస్తూ వచ్చారు. కానీ తగ్గే సూచనలు కనిపించడంలేదు. పైగా పండుగరోజులు కావడం.,.ధన త్రయోదశి, దీపావళి కావడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంలేదు. లాస్ట్ త్రీడేస్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే..ఆదివారం నాడు 24క్యారెట్స్ 10గ్రాముల ధర 80వేల 290 ఉండగా..అది సోమవారం నాటికి 79800కు తగ్గింది. అంటే ఒక్కరోజుకు 490తగ్గింది. ఇంకా తగ్గుతుందని సంబరపడేలోపు మరుసటిరోజుకు అది ఏకంగా 650పెరిగింది.

బంగారం అమాంతంగా పెరగడానికి కారణాలు చూస్తే…ఉక్రెయిన్ రష్యా వార్, మిడిల్‌ ఈస్ట్‌లో ఇంకా చల్లారని యుద్ధ మంటలు, మేజర్ ఎకనామిస్ అయిన చైనా, అమెరికా, రష్యా..డౌన్ ఫాల్ కావడం.. అమెరికా ఎలక్షన్స్ ప్రభావం బులియన్ మార్కెట్‌పై విపరీతంగా ఉండటం…ఇవన్నీ ఓకారణమైతే.. మరో మేజర్ రీజన్..ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు..అంటే మన దగ్గరుండే ఆర్బీఐ లాంటి బ్యాంకులు..బంగారం నిల్వలను విపరీతంగా పెంచుకుపోతున్నాయి. మాములుగా ప్రపంచంలో బంగారంపై మోజున్న దేశాల్లో నంబర్‌ వన్ మనదేశమే. ఎందుకంటే మన ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యాలకు, పండుగలు పబ్బాలకు బంగారం లేనిదే పొద్దు గడవదు. ప్రస్తుతం నడుస్తున్నది పెళ్లిళ్ల సీజన్, ఫెస్టివల్ సీజన్ కావడంతో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉంది. పైగా మన దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ చాలా అంటే చాలా తక్కువ. అంతా దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నాము. గతేడాది మన దేశంలో మైన్స్ ద్వారా వచ్చిన బంగారం కేవలం 1341 కిలోలు మాత్రమే. కానీ దేశీయ అవసరాలకు అది సరిపోదు. అందుకే మనం ఆఫ్రికాలాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఒకసారి 2010నుంచి 2024వరకు భారత్ ఇంపోర్ట్ చేసుకున్న బంగారం నిల్వలు చూడండి…

2010లో అత్యధికంగా మనం దిగుమతి చేసుకున్న బంగారం వెయ్యి టన్నులు… అలా 2010నుంచి 2023వరకు మన దిగుమతి చేసుకున్న బంగారం..సగటున ఏడాదికి 700నుంచి 800 టన్నులు. చాలా దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు సేఫ్టీ నెట్ కింద బంగారం నిల్వలను కొని పెట్టుకుంటున్నాయి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర 846 టన్నుల బంగారం నిల్వ ఉంది. ఈఏడాది 43 టన్నుల బంగారం కొనిపెట్టుకుంది. 2018-24వరకు రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్‌ను 200 శాతం పెంచుకుంది. ఇక అమెరికా దగ్గర ఏకంగా 8 వేల టన్నులు నిల్వ ఉంచుకుని ఉంది…ఇలా సెంట్రల్ బ్యాంక్స్ బంగారం నిల్వలు పెంచుకుంటుంటే…దాని మూలంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. గతవారం ఔన్స్ బంగారం 2600 డాలర్లు…ఔన్స్ బంగారం అంటే 28గ్రాములు..ఇంచుమించు మూడు తులాలు..మన కరెన్సీలో దాని విలువ 2లక్షల 31వేల 500రూపాయలు. దానికి 6శాతం ఇంపోర్ట్ డ్యూటీ వేసుకుంటే 2లక్షల 53వేల90రూపాయలు. అంటే ఒక గ్రాము 8763రూపాయలు పడుతోంది. అంటే రాబోయే రోజుల్లో బంగారం పదిగ్రాములు ధర ఈజీగా లక్ష మార్క్‌ను టచ్ చేసే చాన్సుంది. ఈ గణాంకాలు చూసిన కొందరు ఇప్పుడే బంగారం కొనిపెట్టేందుకు అప్పులు చేసి మరీ షాపులకు క్యూకడుతున్నారు.

ప్రస్తుతం ధర భవిష్యత్‌లో ఇంతమేరకు పెరుగుతుందనేది చెప్పలేము.. కానీ 50వేలు మార్క్ టచ్ అయినప్పుడే వామ్మో అనుకున్న జనం.. 80వేల మార్కును దాటుతుందని ఊహించలేదు.కానీ దాటింది. ఇంతలా బంగారంరేట్లు పెరగడానికి మరో ప్రధాన కారణం..సెక్యూర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ప్రపంచం బంగారాన్ని చూస్తోంది. దేశం ఎంత సంక్షోభంలో చిక్కుకున్నా బంగారానికి వన్నె తరగని గిరాకీ ఉంది. ఓరకంగా ఇప్పుడు బంగారం నిత్యావసర సరుకైంది. రూపాయి మన దగ్గరే చెల్లుబాటు..అదే గోల్డ్..ప్రపంచం మొత్తం చెల్లుబాటులో ఉంది. బంగారానికి ఉన్న రీసేల్ వాల్యూ ఏ మెటల్‌కు లేదు. ప్లాటినం కొనడం తప్ప అమ్మడానికి పనికిరాదు. ఇక వజ్రం కొనేటప్పుడు భారీగా ఉన్నా తిరిగి అమ్మాలంటే సగానికి సగం ధర పడిపోతుంది. కానీ బంగారం అలా కాదు..ఇవాళ ధర ఎంతుందో..అంతే ధరతో బంగారం అమ్మవచ్చు. అందుకే వినియోగదారులు, పెట్టుబడిదారులు బంగారాన్ని సెక్యూర్డ్ ఇన్విస్ట్‌మెంట్‌గా చూస్తున్నారిప్పుడు. సో..డబ్బుంటే ఇప్పుడే కొనిపెట్టేసుకోండి అన్నది నిపుణుల సూచన….బంగారం ఎప్పటికీ బంగారమే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..