- Telugu News Photo Gallery Business photos Pune to get four new Vande Bharat Trains, Know the routes and schedule
Vande Bharat: కొత్తగా నాలుగు వందేభారత్‌లు.. సికింద్రాబాద్ నుంచి మరొకటి.. ఏ రూట్‌లోనంటే.?
పూణే రైల్వే స్టేషన్‌కు మరో 4 వందేభారత్ రైళ్లు త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో.. అది పూర్తికాగానే ప్రధాని మోదీ ఈ రైళ్లకు జెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది.
Updated on: Oct 30, 2024 | 8:00 AM

మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రోజురోజుకూ జనాల్లో ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో సుమారు 66 వందేభారత్ రైళ్లు పట్టాలెక్కగా.. వీటి ఆక్యుపెన్సీ రేషియో కూడా వంద శాతం ఉంటోంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే వీటి టికెట్ ధరలు అధికమే అయినప్పటికీ.. గమ్యస్థానానికి త్వరగా చేరేందుకు ప్రయాణీకులు వీటి వైపే మొగ్గు చూపడం విశేషం.

ఇదిలా ఉంటే.. ప్రయాణీకుల ఆదరణ, రూట్ రద్దీ దృష్ట్యా మరిన్ని వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత రైల్వే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పూణే స్టేషన్ నుంచి మరో నాలుగు రైళ్లను వివిధ మార్గాల్లో పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ యోచిస్తోందట. అందులో ఒకటి మన సికింద్రాబాద్‌కు కూడా నడపనున్నారు.

పూణే-సికింద్రాబాద్, పూణే-షెగావ్, పూణే-వడోదర, పూణే-బెళగావి రూట్ల మధ్య ఈ రైళ్లను నడపనున్నారు. అయితే ఈ రైళ్ల టైమింగ్స్, షెడ్యూల్, ఆగే స్టేషన్ల వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఎలక్షన్స్ పూర్తి కాగానే వీటిని ప్రధానమంత్రి ప్రారంభించే అవకాశం ఉందట.

ఇక ప్రస్తుతం పూణే-కొల్హాపూర్ మధ్య ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. అలాగే సోలాపూర్ నుంచి ముంబై మధ్య నడిచే మరో ఎక్స్‌ప్రెస్ రైలుకు పూణే స్టాప్ ఉంది. ఈ రెండింటితో పాటు ఆ నాలుగు వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకు రానున్నారట.

అటు వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ రైలు ట్రయిల్ రన్ నవంబర్ 15 నుంచి రెండు నెలల పాటు సాగుతుందని సమాచారం. తొలి విడతలో సికింద్రాబాద్ నుంచి వందేభారత్ స్లీపర్ రైలు నడుపుతారని తెలుస్తోంది.



















