Best compact cars: కొండలను సులువుగా ఎక్కే స్పైడర్ కార్లు ఇవే.. టూర్లకు వెళ్లడానికి ఎంతో ఉపయోగం

పర్వత ప్రాంతాలు, కొండలు, ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లి అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలామంది ఇష్టపడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఇలాంటి టూర్లు ప్లాన్ చేసుకుంటారు. నగరంలోని గజిబిజి జీవితం నుంచి ప్రశాంత వాతావరణం ఉన్న చోటుకు వెళ్లడానికి ఇష్టపడతారు. అయితే కొండలు, ఎత్తయిన ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయాణించడానికి మామూలు కార్లు పనికిరావు. నిటారుగా ఉండే రోడ్లపై వెళ్లడానికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కలిగిన వాహనాలు అవసరం. ఇలాంటి సమయంలో కాంపాక్ట్ కార్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వాటి ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తయిన ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లిపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ కాంపాక్ట్ కార్లు, వాటి ధరల వివరాలు (ఎక్స్ షోరూమ్) ఇలా ఉన్నాయి.

Srinu

|

Updated on: Oct 30, 2024 | 3:49 PM

పేరుకు తగినట్టుగానే టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ఎత్తయిన ప్రాంతాలపైకి పరుగులు తీస్తుంది. దీనిలోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి 118 హెచ్ పీ, 170 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. 165 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు సుమారు 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.9.49 లక్షల నుంచి 10.99 లక్షల మధ్య ఉంది.

1 / 5
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ రెండు రకాల ఇంజిన్ల ఎంపికలతో వచ్చింది. 1.2 లీటర్ పెట్రోలు ఇంజిన్ నుంచి 88 హెచ్ పీ, 113 ఎన్ ఎం టార్క్ విడుదల అవుతుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 98 హెచ్ పీ, 147 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ 20 నుంచి 23 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. 190 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ కారు రూ.7.51 లక్షల నుంచి రూ.9.38 లక్షల మధ్య అందుబాటులో ఉంది.

2 / 5
సిట్రోయన్ సీ3 కారు రెండు రకాల ఇంజిన్లతో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నుంచి 80 హెచ్ పీ, 115 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది.  అలాగే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 108 హెచ్ పీ, 205 ఎన్ ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు దాని వేరియంట్ల ప్రకారం 18 నుంచి 19 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంది. సిట్రోయన్ సీ3 ప్రారంభ ధర రూ.6.16 లక్షలు, టాప్ స్పెక్ ట్రిమ్ కోసం రూ.10.26 లక్షలు ఖర్చు పెట్టాలి.

3 / 5
మహీంద్రా 3ఎక్స్ వో కారు ప్రారంభ ధర రూ.7.79 లక్షలు. దీనిలో టాప్ ట్రిమ్ రూ.15.49 లక్షల వరకూ ఉంటుంది. దీనిలో మూడు రకాల ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ నుంచి 118 హెచ్ పీ, 200 ఎన్ ఎం టార్క్ వెలువడుతుంది. అలాగే 1.2 లీటర్ టీజీడీఐ ఇంజిన్ నుంచి 128 హెచ్ పీ, 230 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 115 హెచ్ పీ, 300 ఎన్ ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఈ వాహనం గ్రౌండ్ క్లియరెన్స్ 201 ఎంఎంగా ఉంది.  పెట్రోలు వేరియంట్ 18 నుంచి 20 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ 20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి.

4 / 5
హ్యుందాయ్ విడుదల చేసిన వెన్యూ ఎన్ లైన్ కారు కూడా పర్వతాలు, కొండలపైకి వెళ్లే రోడ్లపై సునాయాసంగా దూసుకుపోతుంది. ఈ కారు బ్రేస్ ట్రిమ్ రూ.12.07 లక్షలు, టాప్ ట్రిమ్ రూ.13.89 లక్షల ధరకు అందుబాటులో ఉంది. దీనిలోని 1.0 లీటర్ టర్బో పెట్రోలు ఇంజిన్ నుంచి 87 హెచ్ పీ, 172 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 195 ఎంఎం. ఈ కారు దాదాపు 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

5 / 5
Follow us
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్