Watch: రిలయన్స్ ఫౌండేషన్ దీపావళి గిఫ్ట్ హ్యాంపర్‌.. వీడియో షేర్‌ చేసిన ఉద్యోగులు.. అదేంటంటే

గిఫ్ట్‌ బాక్స్‌లో "దీపావళి శుభాకాంక్షలు" "శుభ్ దీపావళి" అని ఇంగ్లీష్, హిందీలో రాసి వుంది. వైట్ బాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్, కుటుంబంలోని మనవళ్లు, మనరాళ్ల తరపున శుభాకాంక్షలతో మెసేజ్‌ కూడా ఉంది. అయితే, మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది.

Watch: రిలయన్స్ ఫౌండేషన్ దీపావళి గిఫ్ట్ హ్యాంపర్‌.. వీడియో షేర్‌ చేసిన ఉద్యోగులు.. అదేంటంటే
Reliance Foundation Diwali
Follow us

|

Updated on: Oct 29, 2024 | 6:19 PM

దీపావళి అంటే వెలుగుల పండుగ.. ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాల నడుమ ఇళ్లు, వాకిళ్లు వెలుగులతో నింపుకుని జరుపుకునే సంతోషాల వేడుక.. ఈ పండుగకు ప్రత్యేకించి అందరూ ఒకరికొకరూ బహుమతులు ఇస్తుంటారు. చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులు,సిబ్బందికి గిఫ్ట్‌లు, బోనస్‌ వంటివి ఇస్తుంటారు. ఈ క్రమంలోనే రిలయన్స్ ఫౌండేషన్ తమ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్‌ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండగ నేపథ్యంలో అంబానీలు తమ ఉద్యోగులకు ప్రత్యేక దీపావళి బహుమతిని అందించి ఆశ్చర్యపరిచారు.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈ బహుమతి వీడియోను షేర్ చేశారు. గిఫ్ట్‌ బాక్స్‌లో “దీపావళి శుభాకాంక్షలు” “శుభ్ దీపావళి” అని ఇంగ్లీష్, హిందీలో రాసి వుంది. వైట్ బాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్, కుటుంబంలోని మనవళ్లు, మనరాళ్ల తరపున శుభాకాంక్షలతో మెసేజ్‌ కూడా ఉంది. అయితే, మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ గిఫ్ట్ హ్యాంపర్‌లో దృష్టి లోపం ఉన్న కళాకారులు రూపొందించిన మట్టి దీపం, గ్రీటింగ్ కార్డ్, బాదం ప్యాకెట్, అగరబత్తీలు, చిన్న వెండి గణేశ విగ్రహం, నార టేబుల్‌క్లాత్ ఉన్నాయి. ఈ వీడియోలను ఉద్యోగులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ రాబట్టింది. 500 కంటే ఎక్కువ మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..