ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వాడొచ్చు.. టైమ్ మెషిన్‌లో వెళ్లాల్సిన పన్లేదు.. ఎలాగంటారా

ఒక్కసారి ఈ బ్యాటరీని చార్జ్ చేస్తే.. 50 ఏళ్ల తర్వాతనే మళ్ళీ చార్జింగ్ పెట్టాలి. ఇది మాములు బ్యాటరీ కాదు.. బాహుబలి బ్యాటరీ.. ఎవరు తయారు చేస్తున్నారు.? ఎక్కడ తయారు చేస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వాడొచ్చు.. టైమ్ మెషిన్‌లో వెళ్లాల్సిన పన్లేదు.. ఎలాగంటారా
Mobile Charging
Follow us

|

Updated on: Oct 30, 2024 | 10:30 AM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరికి మొబైల్ ఫోన్ లేదంటే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లాలన్నా.. మొబైల్ ఛార్జింగ్ ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం మొబైళ్లకు 5,000 లేదా 8,000 mAh బ్యాటరీలు వస్తున్నాయి. మనం సరిగ్గా వాడితే కొద్దిగంటల్లోనే ఛార్జింగ్ అయిపోతున్నాయి. అయితే మీరు ఒక్కసారి మొబైల్‌కి ఛార్జింగ్‌ పెడితే కనీసం 50 ఏళ్ల పాటు మళ్లీ ఛార్జింగ్‌ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీలు ఉంటే.? ఏంటి.! ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. టైం మెషిన్‌లో ఫ్యూచర్‌కి వెళ్లాలని అనుకుంటున్నారా.? లేదండీ.!

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇప్పుడు బ్యాటరీలన్నీ కూడా లిథియం అయాన్‌తో తయారవుతున్నాయ్. కానీ ఇది అలా కాదు.. రేడియో యాక్టివ్ కాంపౌండ్ నికెల్-63తో తయారు చేయబడింది. ఈ బ్యాటరీ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, ఒకసారి ఛార్జ్ చేస్తే మళ్ళీ 50 ఏళ్లకే.. ఛార్జింగ్ పెట్టాలి. ఈ బ్యాటరీని చైనీస్ స్టార్టప్ కంపెనీ బీటావోల్ట్ అభివృద్ధి చేస్తోంది . లిథియం బ్యాటరీలకు బదులుగా, వారు న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేస్తున్నారు. దాని శక్తి చాలా సంవత్సరాలు బ్యాటరీని నడిపిస్తుంది. ఎనర్జీ కన్వర్షన్‌కి డైమండ్ సెమీకండక్టర్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ బ్యాటరీ 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెబుతోంది. వచ్చే ఏడాదిలోగా ఈ శక్తిని 1 వాట్‌కు పెంచనున్నారట. ఈ బ్యాటరీ పరిమాణంలో లిథియం బ్యాటరీ కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. గరిష్ట పొడవు 15 మిమీ వరకు ఉంటుంది. దీనిలో అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ బ్యాటరీ ఎప్పటికీ పగిలిపోదు లేదా బర్న్ కాదు. ఈ బ్యాటరీ మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని తట్టుకోగలదు.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

ఈ బ్యాటరీని మొబైల్ ఫోన్లలో ఎప్పుడు వినియోగిస్తారనే దానిపై ఆ కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరికొన్ని ఏళ్లలో ఈ బ్యాటరీని మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతానికి, ఈ బ్యాటరీని స్మార్ట్‌ఫోన్‌లు, డ్రోన్‌లలో ఉపయోగించాలని కంపెనీ ఆలోచిస్తోందట. ఈ బ్యాటరీలను తర్వాత పేస్‌మేకర్లలో కూడా ఉపయోగిస్తారట.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..