Gaming phones: ఆన్‌లైన్ గేమింగ్ లో అంతరాయానికి చెక్..బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఇవే..!
ఆన్ లైన్ గేమ్స్ వాడేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనానికి, ఖాళీ సమయంలో చాలామంది వీటిని ఆడుతూ ఉంటారు. అయితే గేమ్ లను ఆడుకోవడానికి సాధారణ స్మార్ట్ ఫోన్లు పనికిరావు. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, మంచి డిస్ ప్లే, చక్కని ప్రాసెసర్ ఉంటేనే గేమింగ్ కు అంతరాయం కలగకుండా ఉంటుంది.

చాలా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీల నుంచి గేమింగ్ కోసం ప్రత్యేకంగా ఫోన్లు విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా అధిక ర్యామ్, మంచి గ్రాఫిక్స్ ప్రాసెసర్, బ్యాటరీ సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఈ ఫోన్‌లు తక్కువ ధరకే రావడంతో మధ్యతరగతి యువత ఈ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.15 వేల ధరలో మార్కెట్ లో అందుబాటులో ఉన్న 5జీ గేమింగ్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
సీఎంఎఫ్ ఫోన్ 1
సీఎంఎఫ్ ఫోన్ 1లోని 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లేతో విజువల్ స్పష్టంగా కనిపిస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్, గ్రాఫిక్ – ఇంటెన్సివ్ టాస్కుల కోసం మాలి జీ615 ఎంసీ2 జీపీయూ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి మైక్రో ఎస్డీ కార్డుతో 2టీవీ వరకూ స్టోరేజ్ ను విస్తరించుకోవచ్చు.
ఐక్యూ జెడ్9ఎక్స్
ఐక్యూ జెడ్9ఎక్స్ స్టార్ట్ ఫోన్ లో 6.72 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే, నీరు దుమ్మ నుంచి రక్షణకు ఐపీ 64 రేటింగ్ అసిస్టెన్స్ ఉన్నాయి. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఫోన్ పనితీరు బాగుంటుంది. గేమింగ్ కు ఎటువంటి ఇబ్బంది కలగదు. అలాగే మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. దీనిలోని 6000 ఎంఏహెచ్ బ్యాటరీని 44 డబ్ల్యూ ఫాస్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. సైడ్ మౌంటెట్ ఫింగర్ ప్రింట్ సౌకర్యం ఉంది. యూఎస్బీ టైప్ సి పోర్టు, ఆడియో వినడానికి 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, స్టిరియో ఫీకర్లు ఆకట్టుకుంటున్నాయి.
పోకో ఎం7ప్రో
6.67 అంగుళాల పూర్తి హెచ్ ప్లస్ డిస్ ప్లే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్ సెట్ తదితర ప్రత్యేకతలతో పోకో ఎం7 పో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. వెనుక భాగంలో 50 ఎంపీ సోనీలిథియా ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 ఎంపీ కెమెరా అమర్చారు. 45 డబ్ల్యూ ఫాస్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5,110 ఎంఏహెచ్ బ్యాటరీ, దుమ్ము, నీటిని రక్షించేందుకు ఐపీ 64 రేటింగ్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 5 జీ కనెక్టివీటి తదితర అదనపు ఫీచర్లు ఉన్నాయి.
వీవో టీ3ఎక్స్
వీవో టీ3ఎక్స్ స్మార్ట్ ఫోన్ లోని 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ డిస్ ప్లేతో విజువల్ చాలా స్పష్టంగా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీతో పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకూ స్టోరేజీని విస్తరించుకోవచ్చు. దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 44 డబ్ల్యూ ఫాస్ చార్జింగ్ కు ఇది మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ పై నడుస్తుంది.
రియల్ మీ 14ఎక్స్
రియల్ మీ 14ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ఆధారంగా పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫొటోగ్రఫీ కోసం 50 ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఉంది. దీనిలోని 45 డబ్ల్యూ ఫాస్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ కు ఎలాంటి సమస్య ఉండదు. దుమ్ము, నీటి నుంచి ఐపీ 69 రేటింగ్ అసిస్టెంట్ రక్షణ కల్పిస్తుంది. కనెక్టివిటీ పరంగా 5జీ, 4జీ ఎల్ఠీఎఫ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, చార్జింగ్ కోసం యూఎస్ బీ టైప్ సీ పోర్టును ఏర్పాటు చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి