Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి ఆమోదం!
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగి కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.
![Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి ఆమోదం!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/01/ashwini-vaishnaw-1.jpg?w=1280)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగి కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.
16,300 కోట్ల విలువైన మినరల్ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం(జనవరి 29) ప్రకటించారు. దీంతో పాటు సీ కేటగిరీ హెవీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw says, "The Cabinet has approved 'National Critical Mineral Mission' to build a resilient value chain for critical mineral resources vital to Green Technologies, with an outlay of Rs 34,300 crore over seven years…National Critical… pic.twitter.com/gNKAa216OP
— ANI (@ANI) January 29, 2025
2022-23 ఇథనాల్ సరఫరా సంవత్సరం (నవంబర్-అక్టోబర్) నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధరలను పెంచలేదు. చెరకు రసం, బి-భారీ బెల్లం, సి-భారీ బెల్లం నుండి ఉత్పత్తి చేసిన ఇథనాల్ ధరలు వరుసగా లీటరుకు రూ.65.61, రూ.60.73, రూ.56.28గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధరలు సవరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ఇవాళ చక్కెర, ఇథనాల్‌కు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా వృద్ధి చెందాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..