Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత అప్పు ఉన్నా.. ChatGPTతో తీర్చేయొచ్చు..! అది ఎలా సాధ్యం అంటే..

ఒక మహిళ చాట్‌జీపీటీ సాయంతో 10 లక్షల అప్పును నెల రోజుల్లో తీర్చివేసింది. ఆమె ఆదాయం, ఖర్చులను చాట్‌జీపీటీతో పంచుకుని, పొదుపు ప్రణాళికను రూపొందించుకుంది. ఆమె అనుభవాలు, అప్పుల నుండి విముక్తి పొందేందుకు చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు విరంగా తెలుసుకుందాం..

ఎంత అప్పు ఉన్నా.. ChatGPTతో తీర్చేయొచ్చు..! అది ఎలా సాధ్యం అంటే..
Chatgpt
SN Pasha
|

Updated on: Jul 05, 2025 | 9:16 PM

Share

చాలా మంది తెలియకుండానే అప్పుల్లో కూరుకొపోయి.. వాటిని ఎలా తీర్చాలో తెలియక తెగ టెన్షన్‌ పడుతుంటారు. సంపాదన బాగానే ఉన్నా.. అప్పులు మాత్రం తీర్చలేకపోతుంటారు. దాంతో ప్రతీ రోజు వాళ్లకు అదొక పెద్ద టెన్షన్‌ అయిపోతుంటుంది. అయితే.. చాట్‌ జీపీటీ అందుకు మంచి మార్గం చూపిస్తుంది. ఈ ఏఐ చాట్‌బాట్‌ను చాలా మంది చాలా రకాలుగా వాడి ఉంటారు. కానీ, ఓ మహిళ తన జీవితాన్ని గాడిలో పెట్టుకోవడానికి.. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు ఉపయోగించింది. ఏకంగా నెల రోజుల్లోనే రూ.10 లక్షల అప్పు తీర్చింది.

డెలావేర్‌కు చెందిన జెన్నిఫర్‌ అనే మహిళా రియల్టర్‌.. తన ఇంటి అవసరాలకు, బిడ్డ పుడితే ఆమె కోసం సాధారణ ఖర్చులకే క్రెడిట్‌ కార్డ్‌ నుంచి డబ్బులు వాడుకుంది. జల్సాలు చేయడానికి కాకుండా.. కేవలం అత్యవసరాలకు మాత్రమే అప్పు తీసుకున్నప్పటికీ అవి భారీగా పెరిగిపోయాయి. ఆమె సంపాదన కూడా బాగానే ఉన్నప్పటికీ అప్పులు మాత్రం తీర్చలేక ఇబ్బంది పడింది. దీంతో.. తన సమస్యను చాట్‌ జీపీటీ ముందు ఉంచింది. తన సంపాదన ఎంత? ఎంత ఖర్చు అవుతుంది? ఇంటి ఖర్చులు అన్ని వివరంగా చాట్‌జీపీటీతో పంచుకొని.. ఇందులోంచి తాను పొదుపు చేసే మార్గాలు, అప్పు తీర్చే మార్గాలు ఏంటని చాట్‌ జీపీటీని అడిగింది.

అంతే కొన్ని క్షణాల్లోనే చాట్‌ జీపీటీ ఒక అద్భుతమైన ప్రణాళికను అందించింది. నెలవారి ప్రణాళికలో మరిన్ని పొదుపు చర్యలు పాటించడం, ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎక్కడ పొదుపు చేయొచ్చు.. సంపదను ఎలా వాడాలని అని అన్ని వివరంగా వెల్లడించింది. చాట్‌జీపీటీ చెప్పినట్లు ఫాలో అయిన ఆ మహిళ కేవలం నెల రోజుల్లోనే తన రూ.20 లక్షల అప్పు నుంచి సగం తీర్చేసింది. మరో నెల రోజుల్లో తన అప్పు మొత్తం తీరిపోతుందని సంతోషం వ్యక్తం చేసింది. మరి ఎవరైతే అప్పులు ఎలా తీర్చాలా అని బాధపడుతున్నారో.. వాళ్లు కూడా తమ సంపాదన, ఖర్చుల వివరాలు అన్ని చాట్‌ జీపీటీతో పంచుకొని.. అప్పు తీర్చే మార్గాలను అడగండి. అది చెప్పిన ప్రణాళికను ఫాలో అయిపోయి అప్పుల నుంచి విముక్తి పొందండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి