AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

House Buying: కొత్తగా ఇల్లు కొనేవారికి అలెర్ట్.. ఈ లిమిట్ దాటితే కష్టాలు తప్పవు..

ప్రతి వ్యక్తి జీవితంలో సొంతిల్లు కొనడం ఒక కల. అదే సమయంలో ఇంటి కొనుగోలు ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. పెట్టుబడి బ్యాంకర్ సార్థక్ అహుజా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా తొలిసారి ఇల్లు కొనే వారికి ఆరు ముఖ్యమైన నియమాలు తెలిపారు. ఇవి ఆర్థికంగా భద్రతనిస్తాయని ఆయన తెలిపారు. సరైన ఆర్థిక ప్రణాళికతో ఇల్లు కొనడానికి సాయపడతాయన్నారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం..

House Buying: కొత్తగా ఇల్లు కొనేవారికి అలెర్ట్.. ఈ లిమిట్ దాటితే కష్టాలు తప్పవు..
Own House Buying Tips
Bhavani
|

Updated on: Jul 05, 2025 | 9:17 PM

Share

ఇల్లు కొనడమనేది అతిపెద్ద ఆర్థిక నిర్ణయం. ఇది జీవితాంతం ప్రభావం చూపిస్తుంది. అయితే ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఇదే అంశంపై పెట్టుబడి బ్యాంకర్ సార్థక్ అహుజా, ఆర్థిక ఇబ్బందులు పడకుండా తొలిసారి ఇల్లు కొనే వారికి ఆరు ముఖ్యమైన, జాగ్రత్తతో కూడిన నియమాలు తెలిపారు. అవేంటంటే…

ఇంటి ధర.. ఈ లిమిట్ దాటకూడదు..

ఇంటి ధర మీ వార్షిక టేక్-హోమ్ ఆదాయానికి ఐదు రెట్లు మించరాదు. ఈ పరిమితి దాటితే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. ఇది భవిష్యత్ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది.

EMI పరిమితి

మీ నెలవారీ EMI (ఈఎంఐ) మీ నికర ఇన్-హ్యాండ్ కుటుంబ ఆదాయంలో 35 శాతం మించరాదు. ఇది అత్యవసర పరిస్థితులకు తగినంత ఆర్థిక భద్రత ఇస్తుంది. ఆర్థిక ఒత్తిడిని నివారిస్తుంది.

పొదుపు అవసరం

మీరు కొనాలనుకునే ఇంటి విలువలో కనీసం సగం మొత్తానికి సమానమైన పొదుపు ఉండాలి. ఇది డౌన్ పేమెంట్ కవరేజ్ ఇస్తుంది. కొనుగోలు తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది.

పొదుపు కేటాయింపు

మీ పొదుపు నుండి, ఇంటి విలువలో 35 శాతం డౌన్ పేమెంట్కు వాడాలి. 15 శాతం అత్యవసర అవసరాల కోసం లిక్విడ్ ఆస్తులుగా ఉంచుకోవాలి. ఇది ఆర్థిక భద్రతను బలపరుస్తుంది.

ఆర్థిక రక్షణ ముఖ్యం

గృహ రుణం గురించి ఆలోచించే ముందు, మీకు బలమైన ఆర్థిక రక్షణ ఉండాలి. మీ కుటుంబానికి కనీసం ₹50 లక్షల వైద్య బీమా ఉండాలి. ఇంటి విలువకు కనీసం సమానమైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇది అనూహ్య సంఘటనల నుండి రక్షిస్తుంది.

కనీస నివాస కాలం

కనీసం ఐదేళ్లు నివసించాలని మీరు ప్లాన్ చేస్తేనే ఇల్లు కొనండి. తక్కువ కాలం (2-3 సంవత్సరాలు) ఇల్లు కలిగి ఉండటం ఆర్థికంగా మంచిది కాదు. ట్రాన్సాక్షన్ ఖర్చులు, వడ్డీ, ధర పెరుగుదల అంచనా వేయలేకపోవడం వల్ల ఇది లాభదాయకం కాదు.

ఆహుజా నిజమైన ఆర్థిక స్వేచ్ఛ ఇల్లు సొంతం చేసుకోవడంలో మాత్రమే కాదు. భయం లేకుండా ఇల్లు కలిగి ఉండటంలో ఉందని నొక్కి చెప్పారు. ఈ షరతులు పాటించలేకపోతే, అద్దెకు ఉండటం, నైపుణ్యాలు పెంచుకోవడం, లేదా టైర్ 2 నగరాల్లో తక్కువ ధర ఎంపికలను పరిశీలించడం మంచిదని ఆయన సూచించారు.