Renault Cars: రెనాల్ట్ కార్లపై బంపర్ ఆఫర్లు.. ఏకంగా రూ.80 వేల వరకు తగ్గింపులు
భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు సొంత కారు అనేది ఓ ఎమోషన్. కుటుంబం మొత్తం హ్యాపీగా బయటకు వెళ్లాలంటే కారు తప్పనిసరి కాబట్టి లోన్ తీసుకుని అయినా సరే చాలా మంది కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏయే కంపెనీలు ఆఫర్లను అందిస్తున్నాయో? తెలుసుకని కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ కంపెనీ రెనాల్ట్ కొన్ని మోడల్ కార్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా రూ.80 వేల వరకు తగ్గింపులను ఇస్తుంది. రెనాల్ట్ కార్లపై ఉన్న ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రెనాల్ట్ కంపెనీ సంబంధించిన కిగర్ వేరింయట్‌పై కంపెనీ రూ. 80,000 వరకు తగ్గింపులను ప్రకటించింది. జూలై 2025లో తన అమ్మకాలను పెంచుకునేందుకు ఈ మేరకు ఆఫర్‌ను ఇస్తుంది. ముఖ్యంగా నగదు తగ్గింపులతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తుంది. ముఖ్యంగా ఎంపిక చేసిన వేరియంట్‌లకు వర్తించే ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే పోటీతత్వ ఎంట్రీ-లెవల్, కాంపాక్ట్ విభాగాలలో కొత్త కొనుగోలుదారులను ఆకర్షించడానికి రెనాల్ట్ ఈ తగ్గింపులను ఆఫర్ చేస్తుంది. రెనాల్ట్ కిగర్ కారుపై రూ. 40,000 వరకు నగదు తగ్గింపుతో పాటు మరో రూ.40 వేల ఎక్స్చేంజ్ బోనస్‌ను అందిస్తుంది. కిగర్ కారు ప్రస్తుతం ఐదు సీట్ల ఫేస్‌లిఫ్ట్ అవతార్‌తో ఆకట్టుకుంటుంది. పబ్లిక్ రోడ్లపై అనేకసార్లు పరీక్షిస్తున్నట్లు గుర్తించిన ఈ అప్‌డేటెడ్ కిగర్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో అనేక అప్‌డేట్స్ ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అలాగే రెనాల్ట్ క్విడ్ నగదు తగ్గింపు రూ. 10,000, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15,000తో మొత్తం రూ. 25,000 తగ్గింపును అందిస్తున్నారు .రెనాల్ట్ ట్రైబర్ నగదు తగ్గింపు రూ. 25,000 వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 25,000 వరకు అంటే దాదాపు రూ. 50,000 ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా సౌకర్యవంతమైన సీటింగ్ కాన్ఫిగరేషన్‌కు పేరుగాంచిన రెనాల్ట్ ట్రైబర్ ఎంపిక చేసిన ఎంవై 2025 వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కారకు సంబంధించిన అప్‌డెటెడ్ వెర్షన్ కూడా త్వరలో లాంచ్ అవతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంట్రీ లెవల్ కారు విభాగంలో మొదటిసారి కొనుగోలు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో అందిస్తున్నారు. అయితే ఈ అన్ని ప్రయోజనాలు 2025 మోడల్ ఇయర్ వేరియంట్లకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే నిర్దిష్ట డీలర్‌షిప్‌లలో లభ్యతపై ఆధారపడి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..