EV Scooter: లక్ష రూపాయల్లో లక్షణమైన స్కూటర్ రిలీజ్ చేసిన హీరో.. మతిపోగొడుతున్న నయా ఫీచర్స్
ఇటీవల కాలంలో భారతదేశంలో ఈవీ స్కూటర్ల హవా నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ స్కూటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా వారిని ఆకట్టుకునేందుకు తక్కువ ధరలో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ హీరో లక్ష రూపాలయ ధరలో కొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది.

హీరో కంపెనీ భారతదేశంలో విడా వీఎక్స్-2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇటీవల లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఈ ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విడా వీఎక్స్-2 గో వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 99,490 నుంచి ప్రారంభమై ప్లస్ వేరియంట్‌కు రూ. 1.10 లక్షల వరకు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఈవీ స్కూటర్‌లో మీరు సబ్స్క్రిప్షన్ (బీఏఏఎస్) ప్లాన్ బ్యాటరీతో కూడిన వీఎక్స్2ని కూడా ఎంచుకోవచ్చు. ఇలా ఈవీ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే గో వేరియంట్‌కు సంబంధించిన ఎక్స్- షోరూమ్ ధరను రూ.59,490కి, ప్లస్ వేరియంట్‌ను రూ.64,990కి తగ్గిస్తుంది. వీఎక్స్ 2 కిమీకి రూ. 0.96 రన్నింగ్ కాస్ట్ కలిగి ఉంటుందని హీరో పేర్కొంది. అలాగే బీఏఏఎస్ ప్లాన్‌ను ఎంచుకునే కొనుగోలుదారులు దాని పనితీరు 70 శాతం కంటే తక్కువగా ఉంటే వారి బ్యాటరీని ఉచితంగా కొత్తదానికి మార్చుకునే అవకాశం ఉంటుంది.
వీఎక్స్ 2 గో వేరియంట్ 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. హీరో గో వేరియంట్‌కు 92 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. అలాగే వీఎక్స్-2 580 వాట్స్ ఛార్జర్‌తో వస్తుంది. అలాగే ప్లస్ వేరియంట్ 3.4 కేడబ్ల్యూహెచ్ పెద్ద యూనిట్‌తో వస్తుంది. అలాగే దీని మైలేజ్ 142 కి.మీ ఐడీసీ పరిధితో ఆకర్షిస్తుంది. 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను 3 గంటల 53 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అలాగే 3.4 కేడబ్ల్యూహెచ్ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి 5 గంటల 39 నిమిషాలు పడుతుంది. అదనంగా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం అందుబాటులో ఉంది. ఇది కేవలం 1 గంటలో 0-80 శాతం ఛార్జ్ అవుతుంది. అలాగే రెండు బ్యాటరీ ప్యాక్‌లు రెండు గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతాయి.
హీరో విడా వీఎక్స్-2 గో 4.3 అంగుళాల ఎల్‌సీడీ డిస్ ప్లేను కలిగి ఉండగా వీఎక్స్ 2 ప్లస్ 4.3 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్‌తో ఆకర్షిస్తుంది. గో వేరియంట్ 33.2 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌తో వస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా ప్లస్‌లో మాత్రం 27.2 లీటర్లకు తగ్గుతుంది. వీఎక్స్2కు సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్ల పవర్ అవుట్ పుట్‌ను కంపెనీ వెల్లడించనప్పటికీ గో వేరియంట్ గరిష్టంగా 70 కి.మీ/గం వేగాన్ని కలిగి ఉందని, ప్లస్ 80 కి.మీ/గం వేగాన్ని చేరుకోగలదని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ రెండు మోడళ్లు పసుపు, బూడిద, ఎరుపు, తెలుపు, నీలం, నలుపు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..