Budget 2026: ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త రానుందా? పీఎం కిసాన్ సాయం రూ.10 వేలకు పెరగనుందా?
Budget 2026 PM Kisan Yojna: ఈ బడ్జెట్‌లో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ నిధుల గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన వస్తుందనే దానిపై ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వార్షిక బడ్జెట్‌లో పీఎం కిసాన్ సాయం పెంచుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6000 రూపాయల చొప్పున అందిస్తోంది. అయితే..

Budget 2026 PM Kisan Yojna: కేంద్ర బడ్జెట్ 2026 సమర్పణకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై పరిశీలిస్తోంది. పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, ద్రవ్యోల్బణం ఒత్తిడి మధ్య, రైతులు ప్రభుత్వం నుండి ఉపశమనం కోసం ఆశిస్తున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రభుత్వం తమకు లభించే సహాయాన్ని పెంచుతుందని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులు ఏటా రూ.6,000 పొందుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ మొత్తం వారికి సరిపోదు. అందువల్ల, 2026 బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10,000 కు పెంచుతుందని భావిస్తున్నారు.
పెంపుదల డిమాండ్ ఎందుకు ఉంది?
రైతుల అభిప్రాయం ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్, వ్యవసాయ పరికరాలు గతంలో కంటే చాలా ఖరీదైనవిగా మారాయి. అటువంటి పరిస్థితులలో వార్షిక సహాయం రూ. 6,000 చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే రైతులు వ్యవసాయంలో మెరుగైన పెట్టుబడులు పెట్టడానికి, అలాగే ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని రైతులు భావిస్తున్నారు.
ఈ సందర్భంలో దేశ రైతులు ఈ సంవత్సరం బడ్జెట్ పై అధిక అంచనాలను కలిగి ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచాలని నిర్ణయించుకుంటే అది తోటి రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉండటంతో, రైతుల ఖర్చు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి దారితీస్తుంది.
ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డిసెంబర్ 2018లో ప్రారంభించారు. ఈ పథకం చిన్న రైతులకు, పరిమిత సాగు భూమి ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రైతులు సంవత్సరానికి రూ.6,000 సహాయం పొందుతారు. ఈ నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది కేంద్రం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




