వారెవ్వా.. ఏం మాస్టర్ ప్లాన్ గురూ.. జీఎస్టీ నేపథ్యంలో సిగరెట్ ప్రియులకు షాకిస్తున్న డీలర్స్!
అన్నం తినకుండా బతికేవారు ఉంటారు కాని సిగరెట్ అలవాటు ఉన్నవారు దానిని తాగకుండా ఉండలేరు. అయితే ఇప్పుడు ఆ సిగరెట్ ప్రియులకు భారీ షాక్ తగలనుంది. ముఖ్యంగా ఐటీసీ కంపెనీకి సంబంధించిన సిగరెట్లుపై జీఎస్టీ పెరుగుతుందని సమాచారం రావడంతో ఎక్కడికి అక్కడ సిగరెట్లు బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా జీఎస్టీ పెంపుతో దేశ వ్యాపప్తంగా సిగరెట్ల రేట్లు 40% పెరిగే అవరాశం ఉంది. దీంతో కడప జిల్లాకు చెందిన కొంత మంది డీలర్లు సీక్రెట్లు బ్లాక్ మార్కెట్ లను ఏర్పాటు చేసి సిగరెట్లను బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీసీ కంపెనీకి చెందిన పలు సిగరెట్లు స్టాక్ లేవని , కంపెనీ నుంచి స్టాక్ రాలేదంటూ డిలర్లు చెబుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం 170 రూపాయలు ఉన్న సిగరెట్ ప్యాకెట్ జీఎస్టీ పెరుగుదలతో రూ. 250 కు చేరే అవకాశం ఉంది. దీంతో రేట్లు పెరిగిన తర్వాత అమ్మితే ఆధాయం పెరిగే అవకాశం ఉందని సిగరెట్లు లేవంటూ ఇటు వ్యాపారస్తులు కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఐటిసికి సంబంధించిన సిగరెట్లు ఎక్కువగా విక్రయిస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొద్ది రోజుల నుంచి సిగరెట్లపై భారీ మొత్తంలో జీఎస్టీ పెరగబోతుంది అనే సమాచారం రావడంతో ఇప్పటి నుంచే వాటిని బ్లాక్ చేసే అమ్ముతున్నారు. కొంతమంది డీలర్లు అయితే ఒక్కో ప్యాకెట్ కు 60 నుంచి 70 రూపాయలు వరకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో సిగరెట్లను బ్లాక్ చేసి పాత స్టాక్ ను అలానే ఉంచేసుకుంటున్నారంట.. కొత్త రేట్లు పెరిగిన తర్వాత వాటిని విక్రయించవచ్చు అనే ఆలోచనతో అధిక మొత్తంలో డబ్బులు అర్జించవచ్చని ఆపేక్షతో ఇటు డీలర్లు ఆటు వ్యాపారులు సిగరెట్ ప్రేమికులకు భారీ షాక్ ను ఇస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
