PM Awas Yojana: పీఎం ఆవాస్ యోజన ప్రయోజనం ఏంటో తెలుసా? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
Pradhanmantri Awas Yojana: కేంద్రంలోని మోడీ సర్కార్ దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, పేదలకు, ఇతర వర్గాల వారికి ఆర్థికంగా సాయం అందించే పథకాలను అమలు చేస్తోంది. అయితే శాశ్వతంగా ఇల్లు లేనివారికి కూడా ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది..

Pradhanmantri Awas Yojana: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం రకరకాల పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఆవాస్ యోజన ఒకటి. ఇంకా శాశ్వత ఇల్లు నిర్మించుకోని పట్టణ కుటుంబాలకు శుభవార్త ఉంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 (PMAY-U 2.0) కింద ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇల్లు నిర్మించడానికి, కొనడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది కేంద్రం. ఈ పథకం 2024 నుండి 2029 వరకు ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.
PMAY-U 2.0 ఎవరి కోసం?
ఈ పథకం భారతదేశంలో ఎక్కడా శాశ్వత ఇల్లు లేని కుటుంబాల కోసం. ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG), మధ్య ఆదాయ వర్గాలు (MIG) చెందిన పట్టణ కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం చేకూరుస్తుంది. వారి అవసరాలను బట్టి లబ్ధిదారులు కొత్త ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేయవచ్చు. లేదా అద్దె గృహాలను ఎంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Budget 2026: ఈ బడ్జెట్‌లో రైతులకు శుభవార్త రానుందా? పీఎం కిసాన్ సాయం రూ.10 వేలకు పెరగనుందా?
ఆదాయ పరిమితి ఎంత?
- ఆర్థికంగా బలహీన వర్గాల వారికి: వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు
- తక్కువ ఆదాయ వర్గాల వారికి: వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుండి రూ. 6 లక్షల మధ్య.
- మధ్య ఆదాయ వర్గాల వారికి: వార్షిక ఆదాయం రూ. 6 లక్షల నుండి రూ. 9 లక్షల మధ్య
ఎవరు దరఖాస్తు చేసుకోలేరు?
గత 20 సంవత్సరాలలో ఏదైనా కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక సంస్థల గృహనిర్మాణ పథకం నుండి ప్రయోజనం పొందిన వారు PMAY-U 2.0 కి అర్హులు కారు. మొదటిసారి ఇంటి యజమానులకు మాత్రమే సహాయం చేరేలా చూడటం దీని లక్ష్యం.
ఈ పథకాన్ని ఎవరు నడుపుతారు?
PMAY-U 2.0 ను గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. PMAY-U 2.0 పట్టణ కుటుంబాలు తమ ఇంటిని సొంతం చేసుకోవాలనే కలను నెరవేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. మీరు అర్హులైతే ఆదాయ పరిమితులు, అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా సమీక్షించి, సకాలంలో దరఖాస్తు చేసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




