Trent Shares Fall: కేవలం 2 నిమిషాల్లోనే రూ.162 కోట్లు నష్టపోయిన డిమార్ట్ యజమాని రాధాకిషన్ దమాని
Trent Shares Fall: గత నాలుగు త్రైమాసికాలుగా ధర-ఆదాయ నిష్పత్తి 50 కంటే ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంది. అలాంటి సందర్భాలలో స్వల్ప నిరాశ లేదా వృద్ధిలో మెరుగుదల లేకపోవడం కూడా స్టాక్ ధరలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తుంది..

Radhakishan Damani: మంగళవారం స్టాక్ మార్కెట్ క్షీణతతో ట్రేడయ్యింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ రెడ్ జోన్‌లో ఉన్నాయి. ఈ క్షీణత మధ్య మార్కెట్ ప్రారంభమైన వెంటనే ట్రెంట్ షేర్లు కుప్పకూలాయి. స్టాక్ అకస్మాత్తుగా 8% కంటే ఎక్కువ పడిపోయింది. అలాగే ప్రముఖ పెట్టుబడిదారు రాధా కిషన్ దమాని కేవలం రెండు నిమిషాల్లో రూ.162 కోట్లు కోల్పోయి అతిపెద్ద దెబ్బను చవిచూశారు.
ఒక్క క్షణంలో కుప్పకూలిన టాటా షేర్లు:
దలాల్ స్ట్రీట్‌లో అనుభవజ్ఞుడైన వాల్యూ ఇన్వెస్టర్, డిమార్ట్ యజమాని రాధాకిషన్ దమాని మంగళవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే ట్రెంట్ షేర్లు 8% కంటే ఎక్కువ పడిపోయడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టాటా గ్రూప్ రిటైల్ యూనిట్ అయిన ట్రెంట్ స్టాక్ మంగళవారం భారీ అమ్మకాలను చూసింది.
ధర రూ.4000కి పడిపోయింది:
మనం NSE డేటాను పరిశీలిస్తే ట్రెంట్ లిమిటెడ్ షేరు రూ.4208 వద్ద ప్రారంభమైంది. దాని మునుపటి ముగింపు ధర రూ.4417 నుండి గణనీయంగా పడిపోయింది. ఆపై అకస్మాత్తుగా రూ.4060కి పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో ఇది 8.35% భారీ పతనం. షేరు పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పడిపోయింది. మధ్యాహ్నం సమయానికి ట్రెంట్ మార్కెట్ క్యాప్ రూ.1.45 లక్షల కోట్లకు పడిపోయింది.
ఆర్‌కె దమానీ భారీ నష్టాన్ని చవిచూశారు:
ప్రముఖ పెట్టుబడిదారుడు, దేశంలోని అత్యంత ధనవంతులైన బిలియనీర్లలో ఒకరైన రాధాకిషన్ దమానీ తన పెట్టుబడి సంస్థ డ్రైవ్ ట్రేడింగ్, రిసార్ట్స్ ద్వారా ట్రెంట్‌లో 43,98,204 ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. ఈ షేర్ల సంఖ్య అతనికి కంపెనీలో 1.24% వాటాను ఇస్తుంది. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఈ టాటా స్టాక్ పతనంతో అతని వాటా విలువ రూ.162.65 కోట్లు తగ్గింది. ఇది కేవలం రెండు నిమిషాల్లోనే రూ.1,948.32 కోట్ల నుండి రూ.1,785.67 కోట్లకు పడిపోయింది.
YouTube Silver Button: యూట్యూబ్‌లో సిల్వర్ బటన్ ఎప్పుడు వస్తుంది? 10,000 వ్యూస్‌కు ఎంత డబ్బు వస్తుంది?
ట్రెంట్ షేర్లు కుప్పకూలిపోవడానికి ఇందుకేనా?
ట్రెంట్ షేర్లలో పదునైన క్షీణతకు గల కారణాల విషయానికొస్తే, డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి వేగంపై పెట్టుబడిదారులు స్పందించిన తర్వాత పడిపోయింది. కంపెనీ బలమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నప్పటికీ, వార్షిక ఆదాయ వృద్ధి గత మూడు నెలలతో పోలిస్తే ఎటువంటి మెరుగుదల చూపలేదు. ఇది కొంతమంది పెట్టుబడిదారులను లాభాలను బుక్ చేసుకోవడానికి ప్రేరేపించింది.
గత నాలుగు త్రైమాసికాలుగా ధర-ఆదాయ నిష్పత్తి 50 కంటే ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంది. అలాంటి సందర్భాలలో స్వల్ప నిరాశ లేదా వృద్ధిలో మెరుగుదల లేకపోవడం కూడా స్టాక్ ధరలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తుంది.
(గమనిక- స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.)
ఇది కూడా చదవండి: Investment Plan: 10 సంవత్సరాలలో రూ.3 కోట్లు ఎలా సంపాదించాలి? ఆశ్చర్యపోయే బెస్ట్ ట్రిక్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




