Bank Holiday In August-2024: ఆగస్టులో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో తెలుసా? పూర్తి వివరాలు

జూలై నెల ముగియబోతోంది. తర్వాత ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే, ఆగస్టు 2024 ప్రారంభంతో చాలా పెద్ద ఆర్థిక మార్పులు కనిపించబోతున్నాయి. అయితే రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా, బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, వీలైనంత త్వరగా..

Bank Holiday In August-2024: ఆగస్టులో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో తెలుసా? పూర్తి వివరాలు
Bank Holidays
Follow us

|

Updated on: Jul 27, 2024 | 3:05 PM

జూలై నెల ముగియబోతోంది. తర్వాత ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే, ఆగస్టు 2024 ప్రారంభంతో చాలా పెద్ద ఆర్థిక మార్పులు కనిపించబోతున్నాయి. అయితే రక్షాబంధన్, జన్మాష్టమి వంటి పెద్ద పండుగల కారణంగా, బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. అటువంటి పరిస్థితిలో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, వీలైనంత త్వరగా పరిష్కరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Condom: Gold Price: షాకింగ్‌ న్యూస్‌.. మళ్లీ బంగారం ధర భారీగా పెరిగే అవకాశం.. ఎంతో తెలిస్తే షాకవుతారు!

ఆగస్టు నెలలో చాలా సందర్భాలలో బ్యాంకుల్లో పని చేయవు. బ్యాంక్ సంబంధిత పని కోసం ఇంటి నుండి బయలుదేరే ముందు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంక్ సెలవుల జాబితాను చూడటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వచ్చే నెలలో ఏకంగా బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సివేయబడనుండగా, రక్షా బంధన్, జన్మాష్టమి సందర్భంగా కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్టులో వచ్చే 13 బ్యాంకు సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు అలాగే వారపు సెలవులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గుర్తించుకోండి.

ఆగస్టు 2024 బ్యాంక్ సెలవుల జాబితా

  1. ఆగస్టు 3 – కేర్ పూజ కారణంగా అగర్తలో బ్యాంకులు బంద్
  2. ఆగస్టు 4 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి
  3. ఆగస్టు 8 – టేన్ డాగ్ ల్హో రమ్ సందర్భంగా గాంగ్‌టక్ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు
  4. ఆగస్టు 10 – రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
  5. ఆగస్టు 11 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  6. ఆగస్టు 13  – పేట్రియాట్ డే సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు హాలిడే
  7. ఆగస్టు 15 – స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
  8. ఆగస్టు 18 – ఆదివారం నేపథ్యంలో బ్యాంకులు బంద్
  9. ఆగస్టు 19 – రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరాఖండ్, డామన్ అండ్ డయ్యూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, చండీగఢ్, ఉత్తరప్రదేశ్‌లలో బ్యాంకులకు సెలవు
  10. ఆగస్టు 20 – శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
  11. ఆగస్టు 24 – నాల్గో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
  12. ఆగస్టు 25, 2024 – ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
  13. ఆగస్టు 26, 2024 – శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సందర్భంగా అండమాన్ నికోబార్, పంజాబ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, డామన్ డయ్యూ, నాగాలాండ్, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఒడిశా, సిక్కిం, గుజరాత్ ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, త్రిపురలలో బ్యాంకులకు సెలవు.

ఇది కూడా చదవండి: Condom: కండోమ్స్‌ అతని జీవితాన్నే మార్చేసింది.. దురదృష్టాన్ని నెట్టేసి అదృష్టాన్ని తట్టి లేపింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!