ED Raids on MP Nama: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగుతున్నాయి.
ED raids on MP Nama Nageswararao House and Office: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మధుకాన్ గ్రూప్ కంపెనీ ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు నిర్వహింస్తోంది. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. అంతేకాదు రూ.వెయ్యి కోట్లకు పైగా రుణాలు పొందినట్టు అభియోగాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని అభియోగాలు ఉన్నాయి.
టీర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది. దాదాపు రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకున్నారు నామా.. పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంకీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎంపీ ఆస్తులపై ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు హాట్ టాపిక్ అయ్యాయి.