Road Accidents: 5 నెలల్లో 338 మంది.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య.. ఇది కేవలం..
Road Accidents In Cyberabad: రోడ్డు ప్రయాణం చేసేప్పుడు చిన్ననిర్లక్ష్యమైనా నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. ప్రతీ రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగిందని, ఇంత మంది మరణించారని వార్తలు వింటూనే ఉంటాం...
Road Accidents In Cyberabad: రోడ్డు ప్రయాణం చేసేప్పుడు చిన్ననిర్లక్ష్యమైనా నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. ప్రతీ రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగిందని, ఇంత మంది మరణించారని వార్తలు వింటూనే ఉంటాం. కొందరు ర్యాష్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు గురవుతుంటే మరి కొందరు ఇతరుల బాధ్యత రహిత డ్రైవింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి గణంకాలను చూస్తుంటే కొన్ని సందర్భాల్లో విస్తుపోతుంటాం. తాజాగా సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన లెక్కలు భయపెట్టిస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది 31.05.2021 వరకు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఓ రిపోర్ట్‌ను విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఈ ఐదు నెలల్లో ఒక్క సైబరాబాద్ పరిధిలోనే ఏకంగా 338 మంది మరణించినట్లు తెలిపారు. వీరిలో అత్యధికంగా 53 శాతం మంది 25 నుంచి 45 ఏళ్ల వయసువారే కావడం గమనార్హం. కుటుంబానికి అండగా ఉండాల్సిన వయసులో అకాల మరణం చెందడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇక మరణించిన వారిలో 86 శాతం మగవారు కాగా 14 శాతం ఆడవారు ఉన్నారు. 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న 18 మంది రోడ్డు ప్రమాదంలో మరణించడం శోచనీయం.
సైబరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..
సైబరాబాద్ పరిధిలో 2021 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి వయస్సు వివరాలు.
ప్రమాదంలో మరణించిన వారిలో 53 శాతం మంది (25-45 వయస్సు), వారి కుటుంబ పోషకులు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/4z9tctfiwS
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 11, 2021
Oats Befits : ఓట్స్‌తో చక్కెర వ్యాధికి చెక్..! అనేక రోగాలకు దివ్య ఔషధం..? ఎలాగో తెలుసుకోండి..