Narender Vaitla |
Updated on: Jun 11, 2021 | 4:32 PM
స్మార్ట్ ఫోన్ నుంచి మొదలు, ల్యాప్‌టాప్ వరకు అన్నింటికి ఫ్రంట్ కెమెరాలు తప్పనిసరిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరగాళ్లు గ్యాడ్జెట్లను హ్యాక్ చేస్తూ కెమెరాల ద్వారా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు.
ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి, అసరం లేనప్పుడు మీ కెమెరాను కవర్ చేసుకునేందుకు కొన్ని గ్యాడ్జెట్లు అందుబాటులో ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? అలాంటి వాటిపై ఓ లుక్కేయండి..
cimkiz wb01: ఇవి ల్యాప్‌టాప్‌తో పాటు స్మార్ట్ ఫోన్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. 0.27 అంగుళాల మందం ఉండే ఈ కవర్‌తో మీ కెమెరాను కవర్ చేసుకోవచ్చు. ఈ ప్రాడక్ట్ అమేజాన్‌లో అందుబాటులో ఉంది.
Throbbing webcam cover: రకరాల రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ వెబ్‌క్యామ్ కవర్ కెమెరాకు అడ్డుగా ఉంటూనే ఫోన్/ల్యాప్‌టాప్‌కు అందాన్ని ఇస్తాయి. 16 గ్రాముల బరువు, 1.1 అంగుళాల పొడవు ఉంటుంది.
supcase web cam cover: చూడడానికి బ్యాండేజీలా కనిపించే ఈ గ్యాడ్జెట్‌తో ఎంచక్కా ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ కెమెరాలను హైడ్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ప్రాడెక్ట్‌పై ఏడాది వారంటీ ఇవ్వడం విశేషం.
KIWI design Laptop Camera Cover Slide: అత్యంత తక్కువ పరిమాణంతో నిర్మించిన ఈ వెబ్ క్యామ్ కవర్ అసలు ఉందా లేదా అన్నట్లు ఉంటుంది. అమేజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రాడక్ట్ కొన్ని ప్రదేశాలకు మాత్రమే డెలివరీ అందుబాటులో ఉంది.