- Telugu News Photo Gallery Science photos America space center nasa share solar eclipse 2021 amazing pics of ring of fire
Solar Eclipse 2021: ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసిన సూర్యగ్రహణం.. అద్భుతమైన ఫోటోలను షేర్ చేసిన నాసా.. చూస్తే వావ్ అనాల్సిందే..
Solar Eclipse 2021: జూన్ 10వ తేదీన ఆకాశంలో కనువిందు చేసిన సూర్యగ్రహణం ఫోటోలను నానా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Updated on: Jun 12, 2021 | 5:28 AM

అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి పాక్షిక, సంపూర్ణ సూర్యగ్రహణం ఫోటోలను షేర్ చేసింది. ఈ సూర్యగ్రహణం ఉత్తర అర్ధగోళంలో మాత్రమే కనిపించింది.

అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి పాక్షిక, సంపూర్ణ సూర్యగ్రహణం ఫోటోలను షేర్ చేసింది. ఈ సూర్యగ్రహణం ఉత్తర అర్ధగోళంలో మాత్రమే కనిపించింది.

అంతరిక్ష కార్యకలాపాలను చూసే ప్రజలు ఈ సూర్యగ్రహణం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. సూర్యగ్రహణం జరిగిన ఆరు నెలల తర్వాత మళ్లీ రావడమే దీనికి కారణం. అంతకుముందు 2020 డిసెంబర్ 4న సూర్యగ్రహణం ఏర్పడింది.

నాసా షేర్ చేసిన ఈ ఫోటోలలో.. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినట్లు స్పష్టంగా చూడవచ్చు. సూర్యడిపై నీడ పడి చిమ్మచీకటికిగా మారింది. అయితే, సూర్యుని పరిమాణం ఎక్కువ కావడంతో చంద్రుడు పూర్తిగా కవర్ చేయలేకపోయాడు. ఫలితంగా రింగ్ ఫైర్‌లా ఆకాశంలో సూర్యుడు కనువిందు చేశాడు.

కాగా, ఈ ఫోటోలను షేర్ చేసిన నాసా.. సోషల్ మీడియాలో ఇలా క్యాప్షన్ పెట్టింది. 'ఈ రోజు ఉత్తరార్థ గోళంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు పాక్షిక, రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణాన్ని చూశారు. తూర్పు తీరం నుండి తీసిన కొన్ని చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. సూర్యగ్రహణం యొక్క చిత్రాలను మీరూ షేర్ చేయొచ్చు.’’ అని ప్రజలను నాసా కోరింది.

కెనడాలోని అంటారియోలో సూర్యోదయంతో సూర్యగ్రహణం ప్రారంభమైంది. గ్రీన్ ల్యాండ్‌లో సూర్యగ్రహణం అద్భుతంగా కనువిందు చేసింది. ఉత్తరార్థ గోళం వైపు కదులుతూ, తూర్పు సైబీరియాకు చేరుకుంది. అక్కడ సూర్యాస్తమయంతో ముగిసింది. అదే సమయంలో 100 నిమిషాల సూర్యగ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ 3 నిమిషాల 51 సెకన్ల పాటు కనిపించింది.




