AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Raids on MP Nama: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగుతున్నాయి.

ED Raids on MP Nama: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
Ed Raids On Mp Nama Nageswararao House
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 11, 2021 | 2:12 PM

Share

ED raids on MP Nama Nageswararao House and Office: టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీ ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు నిర్వహింస్తోంది. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. అంతేకాదు రూ.వెయ్యి కోట్లకు పైగా రుణాలు పొందినట్టు అభియోగాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని అభియోగాలు ఉన్నాయి.

టీర్ఎస్ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది. దాదాపు రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకున్నారు నామా.. పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాల‌పై త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎంపీ ఆస్తులపై ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు హాట్ టాపిక్ అయ్యాయి.

Read Also…  UP CM Yogi meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో యూపీ సీఎం యోగి.. గంటకు పైగా ఏకాంత చర్చలు.. కారణం అదేనా?

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..